బావాయిపాలెంలో చోరీపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

బావాయిపాలెంలో చోరీపై కేసు నమోదు

Mar 25 2026 7:23 AM | Updated on Mar 25 2026 7:23 AM

బావాయిపాలెంలో చోరీపై కేసు నమోదు

నిడమర్రు: బావాయిపాలెం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిడమర్రు ఎస్సై ఎస్‌ఎన్‌వీవీ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ముత్యాల వీర వెంకట సత్యనారాయణ తన భార్యతో కలసి ఇంటికి తాళం వేసి ఈనెల 19న భీమవరంలోని కుమారుడి ఇంటికి వెళ్లారు. 23న తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉండడంతో అందులో ఉన్న నగదు, సుమారు 4 తులాల బంగారం కడియం, కిలో వెండి వస్తువులు చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా నిడమర్రు సీఐ రజనీకుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేలిముద్ర నిపుణులతో వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement