జంగారెడ్డిగూడెం: ప్రమాదవశాత్తు వృద్ధుడిపై చెట్టు విరిగిపడి మృతి చెందాడు. దీనికి సంబంధించి స్టేషన్ హెచ్‌సీ ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన యడ్లపల్లి బొజ్జియ్య (62)తో పాటు కొంతమంది కూలీలు శ్రీనివాసపురం ప్రభుత్వ టింబర్ డిపోలో కూలీలుగా పనిచేస్తున్నారు. బొజ్జియ్య గత 30 ఏళ్ళుగా అదే టింబర్‌లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు కొంత మంది కూలీలతో బయలుదేరి టింబర్ డిపోలో వెదురు కర్రల లోడు చేస్తున్నారు. ఉదయం 9 గంటల సమయంలో పక్కనే ఉన్న చెట్టు విరిగి బొజ్జియ్యపై పడింది. వెంటనే అతన్ని స్ధానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికీ అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


