జంగారెడ్డిగూడెం: సోమవారం ఎర్రకాలవ జలాశయంలో 4.80 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. చక్రదేవరపల్లిలో 1.20 లక్షలు, దేవులపల్లి, తాడువాయి, మతన్నగూడెం రేవుల్లో చేపలు విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడుతూ మత్స్యకారుల ఆదాయ వృద్ధి, ప్రజలకు తాజా చేపల లభ్యత ద్వారా పోషక భద్రత కల్పిస్తున్నామన్నారు. నాణ్యమైన చేపలకు 40 శాతం సబ్సిడీతో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, జడ్పీటీసీ పొల్నాడు బాబ్జి, దాకారపు కృష్ణ పాల్గొన్నారు.
దాడి చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
ఏలూరు టాస్క్‌ఫోర్స్: ఏలూరు జిల్లాలోని నాయుడుగూడెంలో ఓ వ్యక్తికి చెందిన పట్టాభూమిలో రహదారి నిర్మాణం అడ్డుకున్న ఓ మహిళపై టీడీపీ నేతలు కార్యకర్తలు సోమవారం సాయంత్రం దాడి చేశారు. దీంతో మనస్థాపం చెందిన ఆ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని నాయుడుగూడెంలో చోటుచేసుకుంది. నాయుడుగూడెం ఎస్సీ ఏరియాలో పిట్టా విజయకుమార్‌కు ఇళ్లు ఇంటి స్థలం ఉంది. విజయకుమార్ కుమారుడు సంతోషం వైఎస్సార్‌సీపీ కార్యకర్త. దీంతో ఆ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. వారి స్థలంలో రహదారి నిర్మాణానికి పాల్పడటంతో విజయకుమార్ కుమార్తె కాలి ఆస్కా అడ్డుకుంది. దీంతో టీడీపీకి చెందిన నేతలు కొంతమంది దాడికి పాల్పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన ఆస్కా పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
కై కలూరు: అధిక కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు, తోడికోడలు చిత్రహింసులు పెడుతోన్నారని వివాహిత ఫిర్యాదుపై కై కలూరు టౌన్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదయ్యింది. ఆటపాక శివారు జాన్‌పేటకు చెందిన సేరినా బ్లెస్విన్ మండవల్లికి చెందిన యర్రంశెట్టి చందు ప్రేమించి 2023లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కట్నం అడగంతో బ్లెస్విన్ తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో రూ.5 లక్షల కట్నం ఇచ్చారు. తిరిగి కట్నం కోసం చందు వేధించాడు. సోమవారం జాన్‌పేట వచ్చిన చందు తనపైనా, తల్లిదండ్రులపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది.


