ఏలూరు (టూటౌన్): దొమ్మేటి వెంకటరెడ్డి గొప్ప సంస్కర్త అని జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశపు హాలులో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను కలెక్టర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజలను విద్యావంతులను చేసేందుకు దొమ్మేటి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. దొమ్మేటి జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పరు. కార్యక్రమంలో జేసీ ఎంజె అభిషేక్ గౌడ, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఇడీ ఎం ముక్కంటి, సర్వే శాఖ ఏడీ అన్సారీ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆర్‌వీ. నాగరాణి పాల్గొన్నారు.
దొమ్మెటికి నివాళి
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమం నిర్వహించారు. శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జి.మునిరాజా, ఆర్‌ఐ పవన్‌కుమార్, కార్యాలయ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, ఆర్‌ఎస్‌ఐ వెంకటేష్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
దొమ్మేటి జీవితం స్ఫూర్తిదాయకం
భీమవరం (ప్రకాశం చౌక్): శెట్టి బలిజల జాతిపిత, అట్టడుగు వర్గాల విద్య సామాజిక అభ్యున్నతికి కృషి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 19 వ శతాబ్దంలో అట్టడుగు వర్గాలకు విద్యా సామాజిక అభ్యున్నతికి దొమ్మేటి వెంకటరెడ్డి చేసిన కృషి భవిష్యత్తు తరాలకు మంచి ప్రేరణ కలిగిస్తాయని అన్నారు. డీఆర్‌ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఏవీ సూరిబాబు, వసతి గహాల సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కె.వెట్రిసెల్వి


