కొయ్యలగూడెం: మండలంలోని కన్నాపురం రోడ్డులో తంగళ్ళగూడెం వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను అధికారులు క్రమబద్ధీకరించారు. సాక్షి పత్రికలో ఈ నెల 11న ప్రచురితమైన ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు కథనానికి స్పందించి సిబ్బందితో వెళ్లి రెండు చోట్ల ఉన్న స్తంభాలను సరి చేశామని రామారావు తెలిపారు. మెయిన్ రోడ్ లో ఒకటి ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో మరొకటి రెండు రోజులపాటు శ్రమించి క్రమబద్ధీకరించామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు అదే విధంగా ప్రయాణికులు విద్యుత్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.


