ఏఐపై ఎస్పీ శివకిషోర్‌ ప్రజెంటేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఏఐపై ఎస్పీ శివకిషోర్‌ ప్రజెంటేషన్‌

Mar 18 2026 11:10 AM | Updated on Mar 18 2026 11:10 AM

ఏలూరు టౌన్‌: హైదరాబాద్‌ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ)పై ప్రత్యేకంగా ప్రజెంటేషన్‌ ఇచ్చారు. నేర పరిశోధన, పోలీసింగ్‌ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించే లక్ష్యంతో జాతీయ పోలీస్‌ అకాడమీలో చేపట్టిన ఉన్నతస్థాయి వర్క్‌షాప్‌లో ఆయన తనదైన శైలిలో కీలక ప్రసంగం చేశారు. పోలీస్‌ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తూ తన అపార అనుభవంతో ఏఐతో నేర పరిశోధనలో విప్లవాత్మక మార్పులను తెచ్చిన విధానాలపై జిల్లా ఎస్పీ శివకిషోర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. డేటా విశ్లేషణతో నేరాలు జరగక ముందే పసిగట్టటం, అత్యాధునిక పరికరాలతో డిజిటల్‌ సాక్ష్యాధారాలను పగడ్భందీగా సేకరించటం వంటివాటిని వివరించారు. జిల్లాలో ఏఐను వినియోగిస్తున్న తీరును వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement