భీమవరం: సౌత్‌జోన్ హ్యాండ్‌బాల్ పోటీలకు భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధి షేక్ ఖాసిం ఎంపికై నట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు చెప్పారు. కళాశాలలో సోమవారం విద్యార్థిని అభినందించారు. ఈనెల 15న జెఎన్‌టీయూకే హ్యాండ్‌బాల్ సెలక్షన్స్ నిర్వహించగా తమ విద్యార్ధి ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి వారం రోజుల పాటు తమిళనాడులో నిర్వహించే సౌత్‌జోన్ హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొంటాడన్నారు.
పాలకోడేరు: మండలంలోని కొండేపూడి శివారు వరిపొలాల్లో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం కొండేపూడి శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో దాడి చేసి 8 మంది జూదరులను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.4,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎం.రవివర్మ తెలిపారు.


