జంగారెడ్డిగూడెం: చికిత్స పొందుతూ వివాహిత మృతిచెందినట్లు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. పట్టణానికి చెందిన నాయుడు దుర్గారావు, మధుశ్రీ(26)లు స్థానిక ఎస్సీపేటలో ఉంటుంన్నారు. ఈ నెల 8వ తేదీన మధుశ్రీ పిల్లలు మట్టి తింటుండగా చూసిన అత్త పార్వతి మధుశ్రీని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన మధుశ్రీ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆతహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త దుర్గారావు, కుటుంబసభ్యులు మధుశ్రీని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మధుశ్రీని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధుశ్రీ మృతిచెందింది. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


