పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరిగిన జాతీయ స్థాయి నాటికల పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ మూడు రోజులు ప్రదర్శనలో ఏడు నాటికలను ప్రదర్శించారు. వీటిలో గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా చైతన్య కళాభారతి కరీంనగర్ ఖరీదైన జైళ్లు, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్ సహన, జ్యూరీ ప్రదర్శనగా ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారి మంచి మనసులు నాటికలు ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగా గంగోత్రి సాయి, ఉత్తమ నటిగా బి.నాగరాణి, ప్రతి నాయకుడిగా అద్దేపల్లి లక్షణశాస్త్రి, ఉత్తమ హాస్యనటుడిగా టి.సుబ్బారావు ఎన్నికయ్యారు. న్యాయ నిర్ణేతలుగా లండ రుద్రమూర్తి బిలాయి, గెద్ద వరప్రసాద్ విజయనగరం, గుత్తు చిన్నారావు, శ్రీకాకుళం వ్యవహరించారు. కళాపరిషత్ అధ్యక్షులు కేవీ కృష్ణవర్మ, మానాపురం సత్యనారాయణ, మేడికొండ శ్రీనివాసరావు, విఠాకుల రమణ, జక్కంపూడి కుమార్, కొనిజేటి గుప్త, రెడ్డి వాసు పాల్గొన్నారు.


