ఏలూరు (టూటౌన్): జిల్లా లోని రిజర్వ్ అటవీ, అభ యారణ్య ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తాగునీటి బోర్లు, పైపులైన్లు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించే అవకాశాలను పరిశీలించి ని వేదికలను సమర్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం రిజ ర్వ్ అటవీ ప్రాంతాలు, అభయారణ్య ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక సౌకర్యాల కల్పనపై జేసీ అభి షేక్ గౌడ, జిల్లా అటవీ శాఖాధికారి సందీప్‌రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ నూజివీడు, పోలవరం నియోజకవర్గాల్లోని రిజర్వ్ ఫారెస్ట్, అభయారణ్య ప్రాంతాలు, కొల్లేరు అభయారణ్య ప్రాంతాల్లో వసతుల కల్పన, గిరిజన ప్రాంతంలో పీఎం జగన్‌మన్ కార్యక్రమంలో పేదలకు ఇళ్ల నిర్మాణం, సౌకర్యాల కల్పనకు చర్యలు తీ సుకోవాలన్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఎస్‌ఈ లు జెడ్.రమేష్, రమేష్, త్రినాథ్‌బాబు, హౌసింగ్ అ ధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


