ఆచూకీ కోసం గాలింపు | - | Sakshi
Sakshi News home page

ఆచూకీ కోసం గాలింపు

Mar 17 2026 7:41 AM | Updated on Mar 17 2026 7:41 AM

ఆచూకీ కోసం గాలింపు

న్యూస్‌రీల్‌

నో డ్రగ్స్‌ అంటూనే..

గణపవరం మండలం పిప్పరలో పంట కాలువలో ఈతకు దిగి గల్లంతైన బాలుడు ప్రమోద్‌వర్మ ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా జరుగుతోంది. IIలో u

మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పరువు పోయింది.. కేడర్‌కు ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి.. ఎమ్మెల్యేలకు, ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఏం చెప్పాలో అర్థంకాని స్థితి.. ఇదంతా అబద్ధమని చెప్పడానికి ఒక్క ఎమ్మెల్యేగాని, కనీసం బాగా స్నేహం చేస్తున్న జిల్లా మంత్రులుగాని ముందుకు రాకపోవడంతో ఉమ్మడి పశ్చిమలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ పరువు పూర్తిగా పోయింది. జాతీయస్థాయిలో ఏలూరు పరువు తీశారంటూ కార్యకర్తలే సైటెర్లు వేస్తున్న పరిస్థితి. ఇక సోషల్‌ మీడియాలో అయితే ఎంపీ పుట్టాను తారాస్థాయిలో ఆడుకుంటున్నారు.

రాష్ట్రస్థాయిలో హాట్‌ టాపిక్‌గా..

ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్‌ శనివారం మొయినాబాద్‌లో ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కా రు. వైద్యపరీక్షల్లో డ్రగ్స్‌ తీసుకున్నట్లు తెలంగాణపోలీసులే అధికారికంగా ప్రకటించి అరెస్టు చేసి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడం రాష్ట్రస్థాయిలోనే హాట్‌టాఫిక్‌గా మారింది. మరోవైపు జాతీయ స్థాయిలో డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడిన తొలి ఎంపీగా, అదేవిధంగా డ్రగ్స్‌ కేసులో స్టేషన్‌ బెయిల్‌ వచ్చిన మొదటి వ్యక్తిగా ఎంపీ పుట్టా ఖ్యాతి గడించారంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. ఇక ఎంపీగా గెలుపొందిన నాటి నుంచి జిల్లా రాజకీయాల్లో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కొద్దొగొప్పొ హవా సాగిస్తున్న ఎంపీ పరువు ఒక్క ఘటనతో పూర్తిగా పోయింది. జిల్లాలో లోకేష్‌ సొంత మనిషి అంటూ కేడర్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన పుట్టా మహేష్‌ తలెత్తుకోలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ క్రమంలో ఎంపీకి మద్దతుగా మంత్రి కొలుసు పార్థసారథి మొదలు బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల వరకూ ఏ ఒక్కరూ కనీసం నోరు మెదపకపోగా పరువు తీశాడంటూ తీవ్రస్థాయిలో సైటెర్లు వేస్తుండటం గమనార్హం. జిల్లాకు ఏం మాత్రం పరిచయం లేకపోయినా తెలుగుదేశం పార్టీలో కీలక నేతల రాజకీయ వారుసుడు కావడంతో జిల్లాకు చెందిన మాగంటి బాబును పక్కన పెట్టి మరీ పుట్టా మహేష్‌కు రెడ్‌కార్పెట్‌ వేశారు. లోకేష్‌ సొంత మనిషి అంటూ హడావుడి చేశారు. పుట్టా మహేష్‌ తండ్రి సుధాకర్‌ ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యే, గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. అలాగే టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు కు మార్తెను మహేష్‌యాదవ్‌ వివాహం చేసుకోవడం, దీంతో పాటు తెలంగాణలోని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబంతో బంధుత్వం ఉండటంతో తెలుగుదేశం టికెట్‌ సునాయాసంగా వచ్చింది. అంతే సునాయాసంగా పార్లమెంట్‌ నియోజకవర్గంలో పుట్టా మహేష్‌ గెలుపొందిన పరిస్థితి.

డ్రగ్స్‌ వద్దంటూ తన అఫీషియల్‌ ఖాతాలోపోస్టు పెట్టిన ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ ఎన్నికల ప్రచారంలో డ్రగ్స్‌ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ నిత్యం సోషల్‌ మీడియాలో పోస్టులు, ప్రసంగాలతో హడావుడి చేశారు. గడిచిన ఐదేళ్లల్లో 2,107 మంది డ్రగ్స్‌బారిన పడి మృతి చెందారని, డ్రగ్స్‌ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. కట్‌చేస్తే.. అదే డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడటంతో సోషల్‌ మీడియాలో ఎంపీని మీమర్స్‌ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఘన కీర్తి ఉన్న ఏలూరు పార్లమెంట్‌ స్థానం నుంచి సూపర్‌స్టార్‌ కృష్ణ, కేంద్ర మంత్రులుగా పనిచేసిన బోళ్ల బుల్లిరామయ్య, కా వూరు సాంబశివరావు వంటి వ్యక్తులు పార్లమెంట్‌ ఖ్యాతిని పెంచితే ప్రస్తుత ఎంపీ పుట్టా చర్యలతో పరువు పోయిందంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటం గమనార్హం.

చెప్పేవి నీతులు.. చేసేవి డ్రగ్‌ల్బాజీ పనులు

పరువు పోయిందిగా..!

జాతీయ స్థాయిలో ఏలూరు పార్లమెంట్‌ పరువు గోవిందా

నో డ్రగ్స్‌ అంటూనే డ్రగ్స్‌ తీసుకున్న ఎంపీ పుట్టా

అడ్డంగా దొరికిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఎంపీ వర్గం

ఎంపీ ఘటనపై నోరుమెదపని జిల్లా మంత్రి, టీడీపీ ఎమ్మెల్యేలు

ఉమ్మడి పశ్చిమలో హాట్‌ టాపిక్‌గా పుట్టా డ్రగ్స్‌ వ్యవహారం

జిల్లాలో తలెత్తుకోలేకపోతున్నామంటూ టీడీపీ నేతల అసహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement