ఏలూరు (టూటౌన్): డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌యాదవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఏలూరులో సోమవారం నిరసన చేపట్టారు. నగరంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం, కె.ప్రభాకరెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్‌ను అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులే డ్రగ్స్ పార్టీలకు వెళ్లడం, పట్టుబడటం సిగ్గుచేటని విమర్శించారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం మౌనం వహించడం ఏంటని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీలపై వేటు వేస్తున్న బీజేపీ ప్రభుత్వం కూటమి ఎంపీ పుట్టాపై ఎందుకు చర్య లు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నాయకులు డీఎన్‌వీడీ ప్రసాద్, ఆర్. లింగరాజు, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


