సాక్షి టాస్క్‌ఫోర్స్: పసిపిల్లల విక్రయ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్బిశెట్టి వీరమ్మతో సహా మరో 8 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఎవరి పాత్ర ఎంత? సహకరించింది ఎవరూ? సెల్‌ఫోన్ కాల్‌డేటా ను సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏలూరు డీ ఎస్పీ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో కైకలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ ఇప్పటికే పోలీసు బృందాలుగా ఏర్పడి కేసు చేధిస్తున్నారు.
శిశు సంరక్షణ కేంద్రానికి పిల్లలు
నియోజకవర్గంలో మొత్తం ఐదుగురు పిల్లల విక్రయాలు జరిగినట్టు ప్రాథమికంగా అధికారులు తే ల్చారు. వీరిలో ముదినేపల్లి మండలం అన్నవరంలో దంపతులకు విక్రయించిన ఏడాది మూడు నె లల పాప, మండవల్లి మండలం కానుకొల్లులో 15 నెలల బాబు తల్లిదండ్రుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ముదినేపల్లి మండలం పెయ్యేరు లో అన్నవరం, కానుకొల్లులో జరిగిన పసిపిల్లల వి క్రయాలపై ముదినేపల్లి తహసీల్దార్ లతీఫ్‌పాషా, కై కలూరు ఐసీడీఎస్ సీడీపీఓ ఎన్.దీప్తి, ముదినేపల్లి ఎస్సై వీరభ్రదరావులు సోమవారం విచారణ చేశా రు. ఇద్దరు పిల్లలను ఏలూరు శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పిల్లల్లో ఒకరి అసలు తల్లిదండ్రుల జాడ పోలీసులు గుర్తించారు. అలాగే ముదినేపల్లి మండలం శ్రీహరిపురంలో రెండు నెలల క్రితం ఆడుకుంటూ అదృశ్య మైన ఆకేటి మోక్షిత్ కేసు చిక్కుముడి వీడలేదు. బా లుడి ఆచూకీ పోలీసులు గుర్తించలేకపోతున్నారు.


