వీరవాసరం: సమాజ ఉద్ధరణకు నాటక రంగం కీలకమని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, వైఎస్సార్‌సీపీ భీమవరం ఇన్‌చార్జి చినమిల్లి వెంకటరాయుడు అన్నారు. వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటక పోటీలు ముగింపు సభ సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు మాట్లా డుతూ సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి నాటకాలు దోహదపడతాయని అన్నారు. నాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని శాసనమండలిలో ప్రస్తావించినట్టు ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ అన్నారు. నాటక సినీ నటి అమృత వర్షిణి, కరాటే క్రీడాకారిణి కవురు అభిలాషను సత్కరించారు. కళాపరిషత్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ, మెంటే పార్థసారథి, చవాకుల సత్యనారాయణమూర్తి, గాదిరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు.
సందేశాత్మకంగా పోటీలు
చిలకమర్తి కళా ప్రాంగణంలో నాటక ప్రదర్శనలు సందేశాత్మకంగా సాగాయి. సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి జనరల్ భోగీలు, మానవతా యడ్లపాడు వారి అందరూ మంచి వారే కాని, శ్రీరమణ కళానిలయం గుంటూరు వారి మా తృత్వం నాటికలు ఆకట్టుకున్నాయి.


