తణుకు అర్బన్: ఆపరేషన్ వజ్ర ప్రహార్‌లో భాగంగా తణుకు పట్టణంలోని ఇరగవరం కాలనీలో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తణుకు రూరల్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో 60 మంది పోలీసులు పాల్గొన్నారు. పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానిత వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. స్థానిక ప్రజలకు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు.
పెదవేగి: రాట్నాలకుంటలో వేంచేసిన రాట్నాలమ్మను ఆదివారం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు, వివిధ సేవల రూపేణా మొత్తం రూ.114,938, ఆదాయం లభించిందని దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ చెప్పారు.


