పారదర్శకత ప్రశ్నార్థకం | - | Sakshi
Sakshi News home page

పారదర్శకత ప్రశ్నార్థకం

Mar 16 2026 7:47 AM | Updated on Mar 16 2026 7:47 AM

పారదర్శకత ప్రశ్నార్థకం ఆటోమేషన్‌ విఫలం ●

ప్రైవేట్‌ టీచర్లకు ఇన్విజిలేషన్‌ బాధ్యతలు అనాలోచిత చర్య. 20 ఏళ్లుగా ఇన్విజిలేషన్‌ విధులు నిర్వహిస్తూ అనుభవజ్ఞులైన ప్రభుత్వ ఉపాధ్యాయులు అందుబాటులో ఉండగా ప్రైవేట్‌ టీచర్లను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

–గెడ్డం సుధీర్‌, వైఎస్‌ఆర్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి

ఇన్విజిలేషన్‌ ఆటోమేషన్‌ విధానం పూర్తిగా విఫలమైంది. పలు లోపాలు తలెత్తాయి. వాటిని సరిచేయడానికి తిరిగి మండల విద్యాశాఖాధికారులనే ఆశ్రయించాల్సి వచ్చింది. అప్పటికప్పుడు మార్పులు, చేర్పులతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆటోమేషన్‌ విధానం లోపభూయిష్టమని ఉపాధ్యాయ సంఘాలు ముందే చెప్పాయి.

–గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్‌ 1938 రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement