ఏలూరు టౌన్: రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకుంటా రో... డ్రగ్స్ విక్ర యాలు చేస్తారో అ లాంటి వారి ఆస్తులు జప్తులు చేస్తామంటూ స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు. టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యా దవ్ డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు, ఎంపీ పుట్టా మహేష్ ఆస్తులు జప్తు చేస్తారా ? చంద్రబాబూ అంటూ వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి, యువజన విభాగం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జోన్ అధ్యక్షుడు కా రుమూరి సునీల్‌కుమార్ యాదవ్ తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఏలూరు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, దేశ చరిత్రలో తొలిసారిగా డ్రగ్స్‌తో ఒక ఎంపీ దొరికిపోవటం బాధాకరమన్నారు. కూటమిలో టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలాంటి నీచమైన పనులు చేసినా సీఎం చంద్రబాబు నోరు మెదపటం లేదని, హోమంత్రి సైతం డ్రగ్స్‌ను నిరోధిస్తామని చెబుతున్నారని, అయితే ఎంపీ పుట్టా విషయంలో ఏమి చెబుతారో వేచి చూడాలన్నారు. ఎంపీ పుట్టా ఏలూరు పరువు తీశారని, నైతికత ఉంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బుట్టాయగూడెం: డ్రగ్స్ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్ దొరకడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నా రు. దుద్దుకూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే ఎంపీ ఇక్కడ కొకై న్‌తో విందులు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రా జ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఇదెక్కడి బా ధ్యతారాహిత్యం అని ప్రశ్నించారు. ఎంపీ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎంపీ ప దవి నుంచి మహేష్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలు బయట పెట్టాలని అన్నారు. ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ప్రజల నమ్మకానికి ద్రోహం చేసేలా ప్రవర్తించకూడదని అన్నారు. ఇటువంటి సంఘటనలు ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బాలరాజు కోరారు.
అభిషేక్ గౌడ, జేసీ
ఏలూరు (టూటౌన్): జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి కొరత లేకుండా సరఫరాకు పటిష్ట చర్యలు చేపట్టామని జేసీ ఎంజే అభిషేక్ గౌడ తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి (డీసీఎస్‌ఓ) కార్యాలయంలో జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామని, సమస్యలు ఉంటే తెలియజేయవచ్చన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెల్ 7569296272 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
ఏలూరు (టూటౌన్): ఏలూరులో సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేశారు. ఈ మేరకు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైందని వైఎస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి గెడ్డం సుధీర్ ప్రకటనలో తెలిపారు. పీఆర్‌సీ, ఐఆర్, పెండింగ్ బకాయిల చెల్లింపులో నిలువునా మోసం చేశారని విమర్శించారు. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్‌సీ ఊసే లేదని, ఐఆర్ విషయంలో కూడా మీనమేషాలు లెక్కిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ లోన్లు, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్స్ అన్నీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడుతున్నారన్నారు. సీపీఎస్ విషయంలోనూ ప్రభు త్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఉపాధ్యాయుల యాప్ భారం తొలగించాలని, ఆటోమేషన్ విధానంతో గందరగోళం నెలకొందన్నారు. సమస్యల పరిష్కారానికి త్వరలో రాష్ట్ర, జిల్లాస్థాయిలో ఉద్యమ కార్యా చరణ చేపట్టనున్నామని వివరించారు.


