పరీక్షల నిర్వహణ పదిలమేనా..? | - | Sakshi
Sakshi News home page

పరీక్షల నిర్వహణ పదిలమేనా..?

Mar 16 2026 7:47 AM | Updated on Mar 16 2026 7:47 AM

నేటినుంచి పరీక్షలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చంద్రబాబు ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయాలు, విధానాలు అపహా స్యానికి గురయ్యాయి. ఆటోమేషన్‌, ప్రైవేట్‌ టీచర్ల ఇన్విజిలేషన్‌ విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో బాలారిష్టాల మధ్య పరీక్షల నిర్వహణ సాగనుందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి.

తేలిపోయిన ఆటోమేషన్‌

ఆటోమేషన్‌ ఇన్విజిలేషన్‌ను తొలి నుంచి ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయి నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా అ మలు చేసింది. సాఫ్ట్‌వేర్‌ నిర్దేశిత ఇన్విజిలేషన్‌ వి ధుల జాబితాను విడుదల చేయగా పలు లోపాలు బయటపడ్డాయి. ఒక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని అదే పాఠశాలలో ఇన్విజిలేషన్‌ విధులకు కేటాయించడం, ఒక పాఠశాల నుంచి అసలు ఒక్క ఉపాధ్యాయుడికీ విధులు కేటాయించకపోవడం, కొందరిని దూర ప్రాంతాలకు కేటాయించడం వంటి లోపాలు అధికారులకు తలనొప్పిగా మారాయి. చివరికి ఈ జాబితాలోని లోపాలను సరిచేయాలని మళ్లీ డీఈఓలను, ఎంఈఓలను పూరమాయించడంతో ఆటోమేషన్‌ విధానం తేలిపోయింది.

‘ప్రైవేట్‌’ ఇన్విజిలేషన్‌పై అనుమానాలు

ప్రైవేట్‌ టీచర్లను ఇన్విజిలేషన్‌ విధుల్లోకి తీసుకోవడం అనాలోచిత నిర్ణయమనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఎందరో సీని యర్లు ఉండగా ప్రైవేట్‌ టీచర్లను ఎందుకు తీసుకుంటున్నారనే ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల పరీక్షల నిర్వహణ పారదర్శకత ప్రశ్నార్థకం కానుందనే అభిప్రాయం వ్యక్తం మవుతోంది. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు మేలు చేసేలా ఇది ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

24,019 మంది విద్యార్థులు

జిల్లాలో 24,019 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 22,990 మంది రెగ్యులర్‌, 1,029 మంది ఫెయిలైన విద్యార్థులు ఉన్నారు. మొత్తంగా 133 కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో ఏ కేటగిరీ కేంద్రాలు 41, బీ కేటగిరీ కేంద్రాలు 58, సీ కేటగిరీ కేంద్రాలు 34 ఉన్నాయి. కాగా 8 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. దూరవిద్య పరీక్షలకు 803 మంది విద్యార్థులకుగాను 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

జిల్లావ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం నుంచి ఏప్రిల్‌ 1 వరకు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 4 నుంచి 13 వరకు ఏలూరులోని సెయింట్‌ గ్జేవియర్‌ ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో 10వ తరగతి పరీక్షలు సైతం సోమవారం ప్రారంభమై ఈనెల 28 వరకు జరుగనున్నాయి.

తేలిపోయిన ఆటోమేషన్‌ విధానం

ప్రైవేట్‌ టీచర్ల ఇన్విజిలేషన్‌పై అనుమానాలు

నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు

జిల్లాలో 24,019 మంది విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement