ఎంపీ పుట్టా రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎంపీ పుట్టా రాజీనామా చేయాలి

Mar 16 2026 7:47 AM | Updated on Mar 16 2026 7:47 AM

ఏలూరు టౌన్‌: నాడు డ్రగ్స్‌ రహిత ఏలూరు పార్లమెంట్‌ చేస్తానంటూ నీతి వాక్యాలు వల్లించిన ఎంపీ పుట్టా మ హేష్‌ నేడు డ్రగ్స్‌ తీసుకుని పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారనీ.. వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు కన్వీ నర్‌ మామిళ్లపల్లి జయప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. ఏలూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) నేతృత్వంలో విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ఎంపీ పుట్టాకు తొలుత ర్యాపిడ్‌ టెస్ట్‌లో నెగిటివ్‌ రాగా... రక్తపరీక్షలో పాజిటివ్‌ వచ్చిందని ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌ స్పష్టం చేశారని తెలిపారు. ఈ కేసులో నుంచి ఎంపీ మహేష్‌ను తప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేసినా హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఉండటంతో సాధ్యం కాలేదన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు పూర్తిగా నిరోధిస్తున్నామని సీఎం చంద్రబాబు తరచూ ప్రకటనలు చేస్తున్నారనీ, అయితే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. సాక్షాత్తు ఒక ఎంపీ ఇలా డ్రగ్స్‌ కేసులో పట్టుబడటం ఇదే తొలిసారి అన్నారు. ఇలాంటి వ్యక్తి ఏలూరు ఎంపీగా ఉండటం ప్రజల దురదృష్టం అన్నారు. యువతకు ఆదర్శంగా నిలవాల్సిన ఎంపీ మహేష్‌ డ్రగ్స్‌ తీసుకుని పట్టుబడటాన్ని ఎలా తీసుకోవాలో చంద్రబాబు చెప్పాలని జేపీ డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ ఏలూరు కన్వీనర్‌ జేపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement