వైఎస్సార్‌సీపీ చింతలపూడి కన్వీనర్ కంభం విజయరాజు
చింతలపూడి కన్వీనర్ విజయరాజు మాట్లాడుతూ నైతిక విలువలు లేని వ్య క్తులకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం, వారంతా అనైతిక, అసాంఘిక కార్యకలాపాల్లో నిమగ్నమై దొరికిపోవటం రాజకీయాలు భ్రష్టుపట్టాయనేందుకు ని దర్శనంగా ఉందన్నారు. రాష్ట్ర హోం మంత్రి అనిత ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ప్లకార్డులు పట్టుకుని డ్రగ్స్ లేకుండా చేస్తామంటూ ప్రచారాలు చేసిన ఎంపీ పుట్టా ప్రజలను తలదించుకునేలా చేశారని విమర్శించారు. టీడీపీ నేతలు ఇప్పటికే రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారనీ, యువతను మత్తుపదార్థాలకు, మద్యానికి బా నిసలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారా అంటూ నిలదీశారు. పోలీసులపైనే గన్‌తో కాల్పులు జ రిపారంటే... డ్రగ్స్ రాకెట్, మాఫియాతో ఎంపీ మహేష్‌కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు నూకపెయ్యి సుధీర్‌బాబు, దాసరి రమేష్, వెజ్జు వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీర్రాజు, నాయకులు మున్నుల జాన్, నెరుసు చిరంజీవి, నాయకులు పల్లి శ్రీనివాస్, తుమరాడ స్రవంతి, జిజ్జువరపు విజయనిర్మల, భాస్కర్ల బాచి తదితరులు పాల్గొన్నారు.


