ఏలూరు టౌన్ : జిల్లాలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ల వినియోగంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కే.నాగేశ్వరరావు గ్యాస్ ఏజెన్సీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ఆదేశాలతో ఏలూరు, భీమడోలు గ్రామాల్లో విజిలెన్స్, పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఏకకాలంలో నాలుగు బృందాలుగా ఏర్పడి గ్యాస్ ఏజెన్సీలపై దాడులు చేశారు. గ్యాస్ ఏజెన్సీల్లో ఆకస్మిక తనిఖీలు చేయగా, నిల్వల్లో ఎలాంటి వ్యత్యాసాలు లేవని అధికారులు తెలిపారు. గృహ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో గ్యాస్ సరఫరా చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఏలూరు నగరంలో మయూర్ హోటల్, వసంతమహాల్ సెంటర్, సితార హోటల్, మౌలాలి ఫాస్ట్‌ఫుడ్స్ వంటి పలు చోట్ల తనిఖీలు చేయగా... 13 గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, విజిలెన్స్ సీఐ ప్రసాద్‌కుమార్, తహసీల్దార్ బీ.కన్యాకుమారి, ఎస్సై సీహెచ్.రంజిత్‌కుమార్, కే.నాగరాజు, పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
ఏలూరులో హోటల్స్‌పై దాడులు


