నూజివీడు: నూజివీడులో కేంద్రీయ విద్యాలయాన్ని ఏ ప్రిల్‌లో ప్రారంభిస్తున్నట్టు కేంద్రీయ విద్యాలయ సమితి ఉత్తర్వులు జారీ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో ఉన్న తాత్కాలిక భవనంలో తరగతులు నిర్వహిస్తారన్నారు. ప్రభుత్వం మార డం వల్ల కేంద్రీయ విద్యాలయం ప్రారంభం ఆలస్యమైందని, లేకపోతే గతేడాదే ప్రారంభించాల్సింద న్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో త రగతికి 40 మంది విద్యార్థులను తీసుకుంటా రన్నారు. దీనిని సాధించడానికి ఎందరో తనకు తోడ్పాటునందించారన్నారు. దీని గురించి టీడీపీ వాళ్లకు అవగాహన లేదని, ఇలాంటి స్కూల్ ఒకటి ఉందని కూడా వాళ్లకు తెలీదన్నారు. దీని కోసం తాను 2020 నుంచి హైదరాబాద్, ఢిల్లీలోని కార్యాలయాలకు పలుమార్లు వెళ్లానన్నారు. నూజివీడులో కేంద్రీయ విద్యాలయానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ట్రిపుల్‌ఐటీకి పక్కనే ఉన్న సర్వే నం. 483–5బీ1లో ఏడెకరాల స్థలాన్ని కేటాయించిందని ప్రతాప్ అప్పారావు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు


