ఫీడ్‌ కంపెనీల ఆగడాలను అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఫీడ్‌ కంపెనీల ఆగడాలను అరికట్టాలి

Mar 13 2026 8:10 AM | Updated on Mar 13 2026 8:10 AM

పాలకొల్లు సెంట్రల్‌: ఆక్వాకు సంబంధించిన ప్రాసెసింగ్‌, ఫీడ్‌ కంపెనీల ఆగడాలను అరికట్టకపోతే భవిష్యత్‌లో రొయ్య మనుగడే లేకుండా పోతుందని జై భారత్‌ క్షీరా రామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు అన్నారు. గురువారం మండలంలోని పూలపల్లి గ్రామంలో ఎస్‌ఎస్‌ఎస్‌ కళ్యాణ మండపంలో తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల ఆక్వా రైతులు, రైతు సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా గాంధీభగవాన్‌ రాజు మాట్లాడుతూ సిండికేట్‌ వ్యవస్థను నియంత్రించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఈ నెల 22న వీరవాసరంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతులు, రైతు సంఘాలతో భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా కౌంట్‌ రేట్లు తగ్గించారన్నారు. రొయ్యలు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం రైతులకు మేలు చేసేలా పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలను పరిశీలించాలన్నారు. ఈ నెల 22న వీరవాసరంలో తులసి కళ్యాణ మండపంలో జరగనున్న సభను విజయవంతం చేసేలా ఆక్వా రైతులందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మూడు జిల్లాల నుంచి ఆక్వా సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement