ప్రజా సంక్షేమమే అజెండా | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే అజెండా

Mar 13 2026 7:58 AM | Updated on Mar 13 2026 7:58 AM

ప్రజా సంక్షేమమే అజెండాగా.. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా.. కారుచీకట్లలో కాంతిరేఖలా.. ప్రజాహితమే లక్ష్యంగా పుట్టిన వైఎస్సార్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాలను గురువారం జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. భారీ ర్యాలీలు, జై జగన్‌ నినాదాలతో హోరెత్తించారు. దివంగత వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌లు కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. కక్ష రాజకీయాలు, కూటమి ప్రభుత్వ కుట్రలను ఎండగడుతూ.. గత వైఎస్సార్‌సీపీ జనరంజక పాలనను గుర్తుచేశారు.

నూజివీడు: వేడుకల్లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు

ఏలూరు: వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న కన్వీనర్‌ జయప్రకాష్‌

గణపవరం: బువ్వనపల్లిలో వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు

సాక్షి ప్రతినిధి,ఏలూరు:

కై కలూరు: కై కలూరు సంత మార్కెట్‌ వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఎగురవేసి 16 కేజీల కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్బంగా డీఎన్నార్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే వలంటీర్లతో కూడిన న్యాయమైన పాలన అందిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నూజివీడు: నూజివీడులో మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు ఆధ్వర్యంలో బాపూనగర్‌లో వైఎస్సార్‌ విగ్రహం వద్ద పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌ను కట్‌ చేసి పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ప్రతాప్‌ అప్పారావు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నిరంతరం ప్రజాపక్షమే ఊపిరిగా పో రాడుతుందని, అధికారం ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన ఉంటూ ముందుకు సాగుతామన్నారు.

పోలవరం: బుట్టాయగూడెంలో మాజీ ఎమ్మెల్యే, పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ చరిత్రలో వైఎస్సార్‌సీపీ ప్రస్థానం ప్రత్యేకమని బాలరాజు అన్నారు.

ఉంగుటూరు: గణపవరం మండలం బువ్వనపల్లిలో పార్టీ పీఏసీ సభ్యుడు, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించిన ఘనత వైఎస్సార్‌సీపీకే చెందుతుందన్నారు.

ఏలూరు: ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. వైఎస్సా ర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం నగరంలోని కోడేలు, వెన్నవల్లివారిపేట, ఫిల్‌హౌస్‌పేట, చిరంజీవి బస్టాండ్‌ సెంటర్‌, వంగాయగూడెం సెంటర్‌, ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్లలో వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని జయప్రకాష్‌ అన్నారు.

చింతలపూడి: చింతలపూడిలో నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని, ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలంతా జగన్‌ వెంటే ఉన్నారని విజయరాజు అన్నారు. కామవరపుకోట, లింగపాలెం మండలాల్లో నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాలు నిర్వహించారు.

ద్వారకాతిరుమల:పేదల అభ్యున్నతి కోసమే వైఎస్సార్‌సీపీ పుట్టిందని మాజీ హోం మంత్రి, గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత అన్నారు. ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంలో వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్‌ కట్‌ చేశారు.

దెందులూరు: దెందులూరులోని పార్టీ యు వ జన విభాగ జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సేవే లక్ష్యంగా.. ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం జిల్లావ్యాప్తంగా సంబరాలు ఏలూరులో 10 చోట్ల వేడుకలు కై కలూరులో భారీ కేక్‌ కట్‌ చేసిన జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement