కొయ్యలగూడెం: మధ్యాహ్న భోజనం అన్నంలో పురుగులు వస్తున్నాయని, ఈ భోజనం తి నలేం అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. దీంతో ఇళ్ల వద్ద నుంచి క్యారియర్ల తెచ్చుకుంటున్నామని అంటున్నారు. కన్నాపు రం జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకంలో వడ్డిస్తున్న ఆహార పదార్థాల్లో పురుగులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల ఎంపీడీఓ తనిఖీల్లో సైతం పథకం నిర్వహణపై అ సంతృప్తి వ్యక్తం చేశారు. అయినా పథకం ని ర్వాహకుల తీరు మారకపోవడంతో పాటు వి ద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలవరం రూరల్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించినట్టు ఎస్సై ఎస్‌ఎస్ పవన్‌కుమార్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. 2018లో పోలవరం మండలం పాత గాజులగొందిలో ఐదేళ్ల గిరిజన బాలికపై అదే ప్రాంతానికి చెందిన నేరం శేఖర్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్ప డ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.వాణిశ్రీ విచారణ అనంతరం నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల నష్టపరిహారం అందించాలని కోర్టు ఆదేశించిందన్నారు.
ఏలూరు(మెట్రో): జిల్లాలో పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ యూనిట్లతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సీఎం చంద్రబాబుకు వివరించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం రెండో రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఏలూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ వివరించారు.
ఉంగుటూరు: వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. గురువారం బాదంపూడి బైపాస్ వద్ద నిడమర్రు సీఐ రజనీకుమార్, చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ తనిఖీలు చేస్తుండగా నలుగురు యువకులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో వారిని పట్టుకున్నారు. వీరి నుంచి మో టార్ సైకిళ్లు, బంగారు, వెండి వస్తువులు, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేబ్రోలు స్టేషన్‌లో డీఎస్పీ శ్రావణ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. తంగెళ్లమూడికి చెందిన తాడి షణ్ముకరావు, రాంచరణ్ తేజ, భీమడోలుకు చెందిన దత్తి నవీన్, తూర్పుగోదవరి జిల్లా మండపేట మండల కేశవరానికి చెందిన పొందుగల అరవింద్ జులాయిగా తి రుగుతూ ఒటరి మహిళల మెడల్లోని బంగారు నగలను చోరీ చేస్తున్నారు. అలాగే గంజాయికి కూడా అలవాటు పడ్డారు. వీరి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, 5.320 కిలోల గంజాయి, బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు. వ్యసనాలకు బా నిసై చోరీలకు పాల్పడుతున్నారని, ఒడిసా ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి విశాఖ తదితర ప్రాంతాల్లో ఎంజాయి చేసి ఈ ప్రాంతంలో పట్టుబడ్డారన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్ర యాణం కల్పిస్తున్నట్టు జిల్లా ప్రజారవాణా అ ధికారి ఎస్.గిరిధర్‌కుమార్ తెలిపారు. ఈనెల 16 నుంచి 28 వరకు హాల్‌టికెట్ చూపించి పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు.


