ఐదేళ్ల చిన్నారి మృతి
బుట్టాయగూడెం: కూల్‌డ్రింక్ అనుకుని పురుగు మందు తాగి ఐదేళ్ల బాలిక మృతిచెందిన ఘటన అంతర్వేదిగూడెంలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు బాలి క ప్రాణాన్ని తీశాయి. వివరాలిలా ఉన్నాయి.. అంతర్వేదిగూడేనికి చెందిన నాగేంద్రబాబు, కుమారి దంపతులకు రితిక (5), శివ (2) సంతానం. రెండు రోజులుగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కుమారి భర్తను బెదిరించేందుకు చిన్న బాటిల్‌లో కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి ఇంటి వద్ద ఓ ప్రదేశంలో ఉంచింది. అయితే రితిక కూల్‌డ్రింక్ అనుకుని బాటిల్‌లోని ద్రవాన్ని తాగేసింది. కొద్దిసేపటికి గొంతు మంట వస్తుందని తల్లికి చెప్పింది. అలాగే రితిక నోట్లో నుంచి నురుగ రావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చిన్నారి అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


