జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో ఆంజనేయస్వామికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అర్చకులు అష్టోత్తరం పూజలు నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,09,929 ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారిణి ఆర్‌వీ చందన తెలిపారు. అలాగే సుమారు 1,719 మంది భక్తులు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు తెలియజేశారు.


