భీమవరం (ప్రకాశంచౌక్): సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ దోహదపడుతుందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. భీమవరం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్ల ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవన్నారు. ఈ వ్యాక్సిన్‌పై అవగాహన పెంచుకోవాలని, 9 నుంచి 45 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలు తప్పక వేయించుకోవాలని కోరారు. ముందుగా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ గదిని ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడారు. డీఎంహెచ్‌ఓ జి.గీతాబాయి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి దేవ సుధాలక్ష్మి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్‌జిత్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


