పప్పన్నాలకు వెళుతూ రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పప్పన్నాలకు వెళుతూ రోడ్డు ప్రమాదం

Mar 9 2026 7:27 AM | Updated on Mar 9 2026 7:27 AM

నూజివీడు : ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు నుంచి పప్పన్నాల నిమిత్తం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్తుండగా నూజివీడు బైపాస్‌ రోడ్డులో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో టాటా మ్యాజిక్‌ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు పక్కన పొలంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఎనిమిది మంది స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. దొడ్డదేవరపాడు నుంచి పప్పన్నాల నిమిత్తం టాటా మ్యాజిక్‌ వాహనంలో వెళ్తుండగా నూజివీడు బైపాస్‌ రోడ్డులో ముసునూరు క్రాస్‌ రోడ్డు వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పక్కనే పంట పొలంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వస్తున్న పట్టణంలోని ఎంప్లాయీస్‌ కాలనీకి చెందిన గోపిశెట్టి అజయ్‌కుమార్‌ (21)కి కాలు విరగ్గా, మ్యాజిక్‌ వాహనంలో ఉన్న ఊట్ల సామ్రాజ్యం (43) చెవి తెగి రక్తం వస్తుండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. టాటా మ్యాజిక్‌లో ఉన్న టి.సరస్వతి (65), ఎం.లలిత (35), సీహెచ్‌ ఉపేంద్ర (42), సీహెచ్‌ బిందూష (20), జి.అనిల్‌కుమార్‌ (36), వి.శ్రీనివాసరావు (29), వి.లక్ష్మీ తులసి (26), సీహెచ్‌ అరుణ (35)లకు స్వల్పగాయాలవ్వగా చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు.

ఇద్దరికి తీవ్రగాయాలు

Advertisement
 
Advertisement
Advertisement