●శ్రీవారి భక్తులకు ‘చల్లని’ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

●శ్రీవారి భక్తులకు ‘చల్లని’ ఏర్పాట్లు

Mar 8 2026 7:48 AM | Updated on Mar 8 2026 7:48 AM

ద్వారకాతిరుమల: భానుడి భగభగలతో శ్రీవారి భక్తులు అల్లాడుతున్నారు. మార్చిలోనే ఎండలు మంట పుట్టిస్తున్నాయి. రోజురోజుకు వేడి, ఉక్కబోత తీవ్రం అవుతుండటంతో ద్వారకాతిరుమల క్షేత్రానికి వస్తున్న భక్తులకు రక్షణ కల్పించే దిశగా దేవస్థానం అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా క్యూలైన్ల వద్ద కూలర్లను, అనివేటి మండపంలో తాగునీటిని ఏర్పాటు చేశారు. అలాగే జంటగోపురాల ప్రాంతం నుంచి ఆలయం వరకు పీచు మ్యాట్లను ఏర్పాటు చేసి, నిరంతరం వాటిని వాటర్‌ ట్యాంకర్‌తో తడుపుతున్నారు. అలాగే ఆలయ ప్రధాన రాజగోపుర మెట్ల మార్గంలో నీరు పారేలా ఏర్పాటు చేశారు. వీటి వల్ల భక్తుల పాదాలకు రక్షణ కలుగుతోంది. ఈ చర్యలతో భక్తులు కాస్త ఉపశమనం పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement