ఆక్వా రైతులకు లైసెన్సులు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఆక్వా రైతులకు లైసెన్సులు తప్పనిసరి

Mar 8 2026 7:48 AM | Updated on Mar 8 2026 7:48 AM

కై కలూరు: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(అప్సడా) నిబంధనల ప్రకారం ఆక్వా రైతులు తప్పనిసరిగా లైసెన్సులు పొందాలని మత్స్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. కై కలూరు మత్స్యశాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో మత్స్యశాఖ జారీ చేసే అప్సడా అనుమతులపై శనివారం నియోజకవర్గ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కై కలూరు నియోజకవర్గంలో మొత్తం 84 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోందన్నారు. అందులో కేవలం 37 వేల ఎకరాలకు మాత్రమే అప్సడా చట్టం ప్రకారం అనుమతులు పొందారన్నారు. ఇంకా 47 వేల ఎకరాలకు అప్సడా అనుమతులు తీసుకోవాలన్నారు. మత్స్యశాఖ గ్రామ సహాయకులు, మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, అనుమతులు పొందని రైతుల నుంచి ఆధార్‌ కార్డు, పాస్‌బుక్‌లను సచివాలయంలో నమోదు చేయించాలన్నారు. కేవలం 15 రోజుల్లో మిగిలిన టార్గెట్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. డీకేటీ భూముల్లో సాగుచేసే రైతులు 11 నెలలకు ఇచ్చే సాగు అనుమతి పత్రాలు పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా మత్స్యశాఖ అధికారి బి.రాజ్‌కుమార్‌, స్థానిక ఫిషరీస్‌ ఏడీ ఎం.రవికుమార్‌, మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు సీహెచ్‌ గణపతి, శ్రీనివాస్‌, సతీష్‌కుమార్‌, వీఎఫ్‌ఏలు పాల్గొన్నారు.

మత్స్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement