ఉత్సాహంగా ఎకై ్సజ్‌ శాఖ జిల్లా స్పోర్ట్స్‌ మీట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఎకై ్సజ్‌ శాఖ జిల్లా స్పోర్ట్స్‌ మీట్‌

Mar 7 2026 8:15 AM | Updated on Mar 7 2026 8:15 AM

ఉత్సాహంగా ఎకై ్సజ్‌ శాఖ జిల్లా స్పోర్ట్స్‌ మీట్‌

ఏలూరు టౌన్‌: నిత్యం విధులు నిర్వర్తించడంలో ఒత్తిడితో ఉండే ఎకై ్సజ్‌ శాఖ అధికారులు, సిబ్బందికి మానసిక ఉల్లాసం, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని ఎకై ్సజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ బీ.శ్రీలత అన్నారు. స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఎకై ్సజ్‌ శాఖ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్పోర్ట్స్‌మీట్‌ను ఎకై ్సజ్‌ డీసీ జెండా ఊపి ప్రారంభించారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ స్పోర్ట్స్‌మీట్‌లో సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపేందుకు కొద్దిసేపు వివిధ క్రీడల్లో పాల్గొన్నారు. సరదాగా కొంతసేపు క్రికెట్‌ ఆడారు. అనంతరం శ్రీలత మాట్లాడుతూ ఒత్తిడికి గురవుతూ ఉండే సిబ్బందికి ఇలా ఆటల్లో పాల్గొనే అవకాశం కల్పించడం ద్వారా పునరుత్తేజంతో విధులను సక్రమంగా నిర్వర్తిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఈఎస్‌ ఆవులయ్య, పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జ్‌ ఈఎస్‌ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement