కనీసం రూ.3 వేలు ఇవ్వాలి
మెగా పీటీఎంకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవు. వేదిక ఏర్పాటు చేయడానికే కనీసం రూ.2 వేలకు పైగా ఖర్చవుతుంది. వచ్చిన వారందరికీ అల్పాహారాలు, భోజనాలు, విద్యార్థులకు బహుమతుల కోసం కనీసం రూ.1,000 అవుతుంది. అలాంటి పరిస్థితిలో 30 మంది విద్యార్థులలోపు పాఠశాలకు రూ.900 కేటాంచడం దారుణం. కనీసం రూ.3 వేలు ఇవ్వాలి.
– జి.మోహన్, ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి
మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించాలనే నిబంధన సరైంది కాదు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రచారానికి వేదికగా చేసుకోవడానికి చూస్తున్నట్టు కనిపిస్తోంది. విద్యార్థులను ఈ స్థాయి నుంచే రాజకీయాల్లోకి లాగాలని చూడడం ద్వారా వారి భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
– కె.లెనిన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
మెగా పీటీఎంను అరకొర నిధులతో పండుగలా ని ర్వహించడం కష్టం. ముఖ్యంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికే ఆయా స్కూళ్లలో టీచర్స్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఈ సమయంలో మెగా పీటీ ఎం భారమే. హైస్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల షెడ్యూల్ ప్రకటించారు. ఉపాధ్యాయులంతా తీవ్ర ఒత్తిడికి గురికావాల్సిన పరిస్థితి. – డి.జోగినాయుడు, ఉపాధ్యాయ సంఘ నేత
కనీసం రూ.3 వేలు ఇవ్వాలి
కనీసం రూ.3 వేలు ఇవ్వాలి


