మాకేమి చేశావు బాబూ? | - | Sakshi
Sakshi News home page

మాకేమి చేశావు బాబూ?

Dec 5 2025 6:09 AM | Updated on Dec 5 2025 6:09 AM

మాకేమ

మాకేమి చేశావు బాబూ?

మద్దిలో మహా పూర్ణాహుతి

న్యూస్‌రీల్‌

కొందరికే ‘సుఖీభవ’

మద్దిలో మహా పూర్ణాహుతి
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో గురువారం మహా పూర్ణాహుతి నిర్వహించారు. సుమారు 3 వేల మంది దీక్షధారులు పాల్గొన్నారు.

శురకవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

సాక్షిప్రతినిధి, ఏలూరు: రైతుల ఇళ్లకు వెళ్లాలి.. సమస్యలు అడిగి తెలుసుకోవాలి.. వ్యవసాయంలో కొత్త మెలకువలు వివరించాలి.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా అందరిని కలవాలనేదే ప్రభుత్వం రూపొందించిన రైతన్నా.. మీ కోసం కార్యక్రమం అజెండా. అయితే జిల్లాలో కార్యక్రమం ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు ముగిసిందో, ఏ రైతుకు ఏం చెప్పారో ఎవరికీ ఏమి తెలియదు. అయినా జిల్లాలో మాత్రం అత్యంత అట్టహాసంగా ప్రారంభమై ముగిసింది. లక్షలాది మందికి అవగాహన కల్పించారు ఇది అధికారిక సమాచారం.

సమస్యల వలయంలో అన్నదాతలు

జిల్లాలో అన్నదాతలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. వరుస పంట నష్టాలు, మోంథా, దిత్వా ఇలా ప్రతి తుపాను వారితో చెలగాటమాడుతూ అపార నష్టం మిగిల్చాయి. ఇక ధాన్యం కొనుగోళ్లు మొదలు ఎరువుల వరకు అన్నింటిలో సమస్యలు రాజ్యమేలుతున్న తరుణంలో డైవర్షన్‌ రాజకీయాల కోసం సిద్ధం చేసిన రైతన్నా.. మీ కో సం జిల్లాలో అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. అయినా అద్భుతంగా జరిగిందంటూ భారీ ప్రకటనలు, ఇతరాత్రా హడావుడి చేసినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. గత నెల 24 నుంచి 29 వరకు ప్రభుత్వ షెడ్యూల్‌ ప్రకారం జిల్లాలో మీ కోసం నిర్వహించారు. అయితే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజాప్రతినిధులు కూడా అరకొరగానే హాజరయ్యారు. రైతుల ఇళ్లకు వెళ్లకుండా, సభల్లా నిర్వహించి మొదటిరోజు అన్ని హామీ లు నెరవేర్చేశామని, అన్నదాత సుఖీభవ మొదలు పరిహారం వరకు ఇచ్చేశామనే రీతిలో విస్తృతంగా ప్రసంగించారు. ఇక అధికారులు మాత్రం చేసేదేమిలేక కరపత్రంలోని ఐదు పాయింట్లను ఎంపిక చేసిన రైతులకు చెప్పడం, సమావేశాలు షెడ్యూల్‌ ప్రకారం అన్ని గ్రామాల్లో నిర్వహించినట్టు రికార్డులు నమోదు చేశారు.

తుపాను సాయం అందలేదు

గత నాలుగు నెలల వ్యవధిలో మోంథా, దిత్వా తు పానులు అపార నష్టం చేకూర్చాయి. మోంథా ధాటికి జిల్లాలో 26,060 ఎకరాల్లో సుమారు రూ.110 కోట్ల పైగా నష్టం వాటిల్లినట్టు అంచనా. 20,300 ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో మినుము, 2,400 ఎకరాల్లో పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న, ఆయిల్‌పామ్‌, పూల తోటలు ఇలా అన్ని పంటలకు నష్టం వాటిల్లింది. అయితే రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అధికారులు సేకరించిందే లేదు. మండల కేంద్రంలో రోడ్డు వెంబడి పొలాల గట్లపై నిలబడి కనీసం రైతులతో మాట్లాడకుండా నివేదికలు పంపారు. కేంద్ర బృందం సైతం అదే రీతిలో పర్యటించింది. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఏ రైతుకు జమ కాని పరిస్థితి. ఇక ధాన్యం ఆరబెట్టడానికి షెడ్లు, రైతులకు బరకాలు కూడా అందించలేదు. వీటన్నింటితో పాటు రైతు భరోసా కేంద్రాలకు రైతుసేవా కేంద్రాలుగా పేరు మార్చిన ప్రభుత్వం కియోస్క్‌ పరికరాలను మూలన పడేసింది. ఇలా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ రైతన్నా.. మీకోసం అంటూ హడావుడి చేయడం గమనార్హం.

అన్నదాతలకు దగా

మొక్కుబడిగా రైతన్నా.. మీకోసం

ప్రచార ఆర్భాటంగా కార్యక్రమం

జిల్లాలో రైతుల పెదవి విరుపు

అన్నదాత సుఖీభవలో కోతలు

అందని తుపాను సాయం

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 1.98 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. అలాగే 6.20 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా. అలాగే ఆయిల్‌పామ్‌, పొగాకు, మొక్కజొన్న, మామిడి ఇలా వాణిజ్య పంటల సాగు అధికంగానే ఉంది. వాస్తవానికి పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద మంజూరు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా పేరిట 1,98,179 మందికి రూ.236.99 కోట్ల సాయం అందించింది. అయితే చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే మొదటి ఏడాది ఎగనామం పెట్టి రెండో ఏడాది రైతుల సంఖ్యను గణనీయంగా కుదించి 1,60,968 మందికి మాత్రమే రూ.106.23 కో ట్లు అందించింది. వేలాది మంది సాయం కోసం అర్జీలు ఇచ్చినా అతీగతి లేదు.

మాకేమి చేశావు బాబూ? 1
1/1

మాకేమి చేశావు బాబూ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement