
కొనలేం.. ధరలు భారం
ఏటా దీపావళి నాడు బాణసంచాకు వెయ్యి రూపాయలకు పైగా ఖర్చు పెట్టేవాళ్లం. అయితే ఈ ఏడాది ధరలు చూస్తూంటే కొనేలా కనిపించడం లేదు. దీనికి తోడు మాలాంటి పేలకు గత ప్రభుత్వంలో పథకాల రూపంలో డబ్బులు అందేవి. అయితే ఇప్పుడు పథకాలు ఏమీ రావడం లేదు. దీంతో డబ్బులు అందడం లేదు.
– ఎస్.మీనాకుమారి, ఏలూరు
బాణసంచా ధరలు చూస్తుంటే గుండె గుభేల్‌మంటోంది. అయినా కొనక తప్పని పరిస్థితి. తక్కువ బడ్జెట్‌లో కొందామంటే కనీసం పిల్లలకు సంతృప్తికరమైన రకాలు కూడా రావడం లేదు. ధరల పెరుగుదల ఇలాగే ఉంటే భవిష్యత్‌లో ఇంటిలో దీపాలు పెట్టి దండం పెట్టుకోవడం తప్ప బాణసంచా కాల్చలేం.
– కె.రమేష్‌బాబు, ఏలూరు
బాణసంచా సామగ్రి కొనేందుకు గతేడాది కంటే 30 శాతం అదనంగా పెట్టాల్సి వచ్చింది. ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. సరుకు అయితే తెచ్చాం కానీ పూర్తిస్థాయిలో అమ్మకాలు జరుగుతాయో లేదో అనే ఆందోళన ఉంది. ఆది, సోమవారాల్లో ప్రజలు వచ్చేదానిని బట్టి గానీ అమ్మకాలను విశ్లేషించలేం.
– సరిది రాజేష్, బాణసంచా వ్యాపారి

కొనలేం.. ధరలు భారం

కొనలేం.. ధరలు భారం