
ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ
కై కలూరు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా భావించి అందరూ దిగ్విజయం చేయాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. కై కలూరు రైల్వేస్టేషన్ సమీప వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ప్రజా వైద్యం, ప్రజల హక్కు అనే పేరుతో చేపట్టనున్న కార్యక్రమాలపై ముదినేపల్లి, కలిదిండి మండలాల ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో నాయకులతో శనివారం సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో 7 మెడికల్ కాలేజీలో పూర్తయ్యాయన్నారు. మరో 4 ప్రారంభం కావాల్సి ఉన్నాయన్నారు. మరో 6 కాలేజీలు వచ్చే ఏడాదికి అందుబాటులోకి తీసుకురావడానికి వైఎస్ జగన్ ప్రణాళిక రూపొందించారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి సిద్ధపడుతోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ పాలనలో రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారని, అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పారన్నారు. కోటి సంతకాల కార్యక్రమానికి సమీప గ్రామంలో పార్టీలో ఒకరిని పరిశీలకులుగా నియమిస్తామన్నారు. అనంతరం అన్ని గ్రామాలకు కోటి సంతకాల కరపత్రాల కిట్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు, ముదినేపల్లి, కలిదిండి మండలాల ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, చందన ఉమామహేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీలు గంటా సంధ్య, కూసంపూడి కనకదుర్గారాణి, రాష్ట్ర రైతు విభాగ జాయింట్ సెక్రటరీ ఐనాల బ్రహ్మాజీరావు, క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర విభాగ సెక్రటరీ జాన్ విక్టర్, ఏలూరు జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షుడు దుగ్గిరాల నాగు, ముదినేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు బోయిన రామరాజు, జిల్లా అధికార ప్రతినిధి గోట్రూ ఏసుబాబు, వివిధ హోదాల్లో నాయకులు కొల్లాటి సత్యనారాయణ, చాన్‌బాషా, పాము రవికుమార్, ముండ్రు చార్లీస్, గద్దె ఆనందకుమార్, పండు ఆనందరవిరాజు, రాచూరి రాథా, దున్నా బేబీ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్