
మ్యాజిక్ స్టార్ బాషాకు మహానంది అవార్డు
జంగారెడ్డిగూడెం: మ్యాజిక్ స్టార్ బాషాకు అంతర్జాతీయ మహానంది అవార్డు లభించింది. హైదరాబాద్ చిక్కడపల్లిలో త్యాగరాయ గానసభ మందిరంలో తెలుగు వెలుగు సాహితీవేదిక వారు నిర్వహించిన శ్రీ మండలి వెంకటకృష్ణారావు శతజయంతి సందర్భంగా అంతర్జాతీయ తెలుగు భాషా సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మ్యాజిక్ షో రంగంలో విశేష కృషి చేస్తున్న జంగారెడ్డిగూడెంకి చెందిన మ్యాజిక్ స్టార్‌కు బాషాకు అంతర్జాతీయ మహానంది జాతీయ పురస్కారం 2025ను బహూకరించారు. ఈ అవార్డును తెలుగు వెలుగు సాహితీ వేదిక చైర్మన్ పోలోజు రాజ్ కుమార్ చార్యులు, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుల భరణం కృష్ణ మోహన్‌రావు, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు దైవజ్ఞ శర్మ, తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్‌చారిల చేతుల మీదుగా అందజేశారు.