
మేతల యాజమాన్యం ఆక్వాలో ప్రాముఖ్యం
ఉండి: మేతల యాజమాన్య పద్ధతులే ఆక్వాలో అత్యత ప్రాముఖ్యమైనవని విజయవాడ సీఐఎఫ్‌ఏ శాస్త్రవేత్త డాక్టర్ రమేష్‌రాథోడ్, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఆక్వాలో మేతల తయారీ, యాజమాన్య పద్ధతులపై ఎన్నార్పీ అగ్రహారం మత్స్యపరిశోధనా కేంద్రంలో మూడు రోజుల పాటు విద్యార్థులు, రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాస్త్రవేత్తలు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆక్వాసాగులో నాణ్యమైన మేతలను సరైన మోతాదులో వినియోగిస్తేనే మంచి దిగుబడులను సాధించగలరని అన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ చంద్రశేఖరరావు మాట్లాడుతూ రొయ్యలు, చేపల లార్వాకు సమతుల్య ఆహారం రోగనిరోధకశక్తి, వేగవంతమైన వృద్ధి కలిగిస్తుందని తెలిపారు. కార్యక్రమాల్లో సైంటిఫిక్ స్టాఫ్ భీమేశ్వరరావు, ధీరణ్, శివకుమార్, షష్టి రిష పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం గునుపూడిలో వేంచేసియున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు శనివారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. 60 రోజులకుగాను రూ.7,32,195, విదేశీ డాలర్లు 3, అన్నదానం హుండీ ద్వారా రూ.7,936 ఆదాయం లభించినట్లు ఈఓ తెలిపారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో తనిఖీదారు వర్థినీడి వెంకటేశ్వరరావు, కర్రి శ్రీను, ఎం. రఘునాధ, ధర్మకర్తల మండలి ఛైర్మన్ చింతలపాటి బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలో అనాథ మృతదేహానికి అమ్మ చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులు అంత్యక్రియలు చేశారు. పట్టణంలోని ఏనుగులు మేడ ఎదురు రోడ్డులో పోలీసులు శనివారం ఒక అనాథ మృతదేహంను గుర్తించారు. ఈ మృతదేహానికి అంత్యక్రియలు చేయవలసి ఉండగా ఎస్సై పృధ్వి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను సంప్రదించగా వారు ముందుకు వచ్చారు. స్థానిక హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సురేష్, ట్రస్ట్ అధ్యక్షుడు అంబటి సాయితేజ, సభ్యులు పాల్గొన్నారు.

మేతల యాజమాన్యం ఆక్వాలో ప్రాముఖ్యం