గళమెత్తిన కలం | - | Sakshi
Sakshi News home page

గళమెత్తిన కలం

Oct 18 2025 7:09 AM | Updated on Oct 18 2025 7:09 AM

గళమెత

గళమెత్తిన కలం

కూటమివి వికృత చేష్టలు స్వేచ్ఛను హరించడమే.. సుప్రీం మొట్టికాయలు వేసినా.. సాక్షిపై దాడులు ఆపాలి స్వేచ్ఛకు భంగం పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం దాడులు అమానుషం ప్రశ్నించే హక్కును హరించేలా.. కక్ష సాధింపులే.. భయంతోనే దాడులు

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

కూటమి ప్రభుత్వ వికృత చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. నకిలీ మద్యం విషయంలో నిజాలను వెలికి తీసినందుకు సాక్షి ఎడిటర్‌, జర్నలిస్టులపై దాడులు చేయడం, వేధింపులకు గురిచేయడం తగదు. పత్రికా స్వేచ్ఛను కాలరాయడం సిగ్గుచేటు.

– మామిళ్లపల్లి జయప్రకాష్‌ (జేపీ),

వైఎస్సార్‌సీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి

భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే హక్కు పాలకులకు లేదు. పత్రికా స్వేచ్ఛకు, ప్రజలకు హాని కలిగించే అధికారం ఎవరికీ లేదు. కల్తీ మద్యంపై వార్తలు రాసినందుకు సాక్షి పత్రిక గొంతు నొక్కే చర్యలను కూటమి పాలకులు విరమించుకోవాలి.

– డాక్టర్‌ మెండెం సంతోష్‌కుమార్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆల్‌ ఇండియా అంబేడ్కర్‌ యువజన సంఘం

సాక్షిపై ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా కూటమి పాలకులకు సిగ్గురాలేదు. ప్రశ్నించే వారిని, కుంభకోణాలు బయటకు తీసే వారిని లక్ష్యంగా చేసుకుని వేధించడం సరికాదు.

– గుడిదేశి శ్రీనివాసరావు,

వైఎస్సార్‌సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు

కూటమి ప్రభుత్వం సాక్షిపై దాడులను తక్షణం విరమించుకోవాలి. సాక్షిపై దాడులను సీపీఐ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి పత్రిక, ఛానెల్‌ ఏదైనా తప్పు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలే తప్ప వేధింపులు సరికాదు.

– బండి వెంకటేశ్వరరావు,

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, ఏలూరు

మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదు. నాడు ప్రతిపక్షంలో ఉండగా కూటమి నాయకులు చేసిందే నేడు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. దీనిలో తప్పేముంది. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలను వీడాలి.

– కె.లెనిన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, ఏలూరు

తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే ఉద్దేశంతో సాక్షి వంటి పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సరికాదు. ప్రతి అంశాన్నీ పత్రికలు వివరించే ప్రయత్నం చేస్తాయి. విమర్శలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

– జిజ్జువరపు విజయ నిర్మల,

వైఎస్సార్‌సీపీ ఏలూరు నగర మహిళా అధ్యక్షురాలు

ప్రజాస్వామ్యంలో పత్రికలపై దాడులు అమానుషం. పత్రికల ద్వారా మంచీ చెడులను విశ్లేషించే అధికారం మీడియాకు ఉంది. దానిని కాలరాసే అధికారం ప్రభుత్వాలకు లేదు. విమర్శించే వ్యక్తులు, వ్యవస్థలపై దాడులు సరికాదు.

– ఎండీ ఇస్మాయిల్‌ షరీఫ్‌,

సామాజిక కార్యకర్త, ఏలూరు

సమాజంలో ప్రతిదానినీ ప్రశ్నించే హక్కు రాజ్యాంగం పౌరులకు కల్పించింది. అలా చేసిన వారిపై అణచివేత చర్యలకు పాల్పడటం, వేధిస్తాననటం కుదరదు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు.

– కాకి నాని, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు, పీడీఎస్‌యూ

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూటమి నాయకులు ప్రజలపై అమితమైన ప్రేమను ఒలకబోస్తూ మొసలి కన్నీరు పెట్టారు. నేడు అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే గొంతుకలపై, వ్యవస్థలపై, పత్రికలపై కక్ష సాధింపులకు దిగుతున్నారు.

– పి.రవికుమార్‌,

సీపీఎం ఏలూరు నగర కార్యదర్శి, ఏలూరు

సమాజంలో ప్రతిఒక్కరికీ మాట్లాడే హక్కు ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తుంటే కూటమి నాయకులు భయపడుతున్నట్లుగా ఉంది. మీ దగ్గర తప్పు లేకపోతే భయపడాల్సిన పనేముంది. ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు వీడాలి.

– తుమరాడ స్రవంతి, కార్పొరేటర్‌, ఏలూరు

ఏలూరు (టూటౌన్‌): నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు ‘సాక్షి’పై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలను వైఎస్సార్‌సీపీ, ప్రజా, జర్నలిస్ట్‌ సంఘా లు ఖండించాయి. సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు, వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించి అధికారులకు వినతులు అందజేశారు. ఏలూరులో కలెక్టరేట్‌ వద్ద జర్నలిస్టు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమాజాన్ని తప్పు దోవ పట్టించేలా ప్రశ్నించే గొంతుకలను అణచివేసే కుట్రలు చే స్తున్నారని, తక్షణం సాక్షి మీడియాపై దాడులు, వే ధింపులు, కేసులు ఆపాలంటూ నినాదాలు చేశారు. అనంతరం జేసీ అభిషేక్‌ గౌడకు వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్‌ (జేపీ),ఆల్‌ ఇండియా అంబేడ్కర్‌ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మెండెం సంతోష్‌కుమార్‌, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, నాయకులు పి.కిషోర్‌, పి.కన్నబాబు, సీపీఎం నగర కార్యదర్శి పంపన రవికుమార్‌, నాయకులు ఎం.ఇస్సాక్‌, జె.గోపి, జర్నలిస్ట్‌ సంఘాల నాయ కులు కేపీ కిశోర్‌, పి.గంగరాజు, ఎస్‌కే రియాజ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్‌, పీడీఎస్‌యూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కాకి నాని, వైఎస్సార్‌సీపీ, జర్నలిస్టు సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

● బుట్టాయగూడెంలో పాత్రికేయులు, వైఎస్సార్‌సీపీ, ప్రజాసంఘాల నాయకులు తహసీల్దార్‌ కా ర్యాలయం వద్ద ధర్నా చేశారు. సివిల్‌ సప్లయ్‌ అధికారి కె.పద్మకు వినతిపత్రం అందించారు.

● చింతలపూడిలో ప్రెస్‌క్లబ్‌, ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. డీటీ ఎస్‌కే షకీలున్నీసా బేగంకు వినతిపత్రం అందించారు.

● నూజివీడులో ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్నకు వినతిపత్రం అందజేశారు.

● కై కలూరులో ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు నిరసన తెలిపి తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీ ఎండీ ఇబ్రహీంకు వినతిపత్రం సమర్పించారు.

● ఉంగుటూరులో ప్రెస్‌క్లబ్‌, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ పూర్ణచంద్రప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.

బుట్టాయగూడెం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందిస్తున్న విలేకరులు

చింతలపూడిలో డీటీకి వినతిపత్రం ఇస్తున్న జర్నలిస్టులు

నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్నకు వినతిపత్రం అందిస్తున్న పాత్రికేయులు

కక్ష సాధింపులపై మండిపాటు

కూటమి ప్రభుత్వ తీరును ఖండించిన ప్రజా, జర్నలిస్ట్‌ సంఘాలు

‘సాక్షి’పై దాడులను ఆపాలని డిమాండ్‌

జిల్లావ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు

అధికారులకు వినతిపత్రాలు అందజేత

గళమెత్తిన కలం 1
1/16

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం 2
2/16

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం 3
3/16

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం 4
4/16

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం 5
5/16

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం 6
6/16

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం 7
7/16

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం 8
8/16

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం 9
9/16

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం 10
10/16

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం 11
11/16

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం 12
12/16

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం 13
13/16

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం 14
14/16

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం 15
15/16

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం 16
16/16

గళమెత్తిన కలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement