
ఆటో కార్మికుల ధర్నా
భీమవరం: ఉచిత బస్సు ప్రయాణం కారణంగా నష్టపోతున్న ఆటో కార్మికులకు రూ.30 వేలు ఆర్థిక సాయం చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కర్రా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఆటో కార్మికుల ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 6.50 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే కేవలం 2.90 లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం సాయం అందించిందన్నారు. నెలకు ఆటో డ్రైవర్ రూ.20 వేలు సంపాదిస్తాడని ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల ఇస్తున్నామని గొప్పలు చెప్పు కోవడం సిగ్గుచేటన్నారు. ఓటు బ్యాంక్‌ను దృష్టిలో పెట్టుకుని పథకాలు ప్రవేశపెడితే చాలా మంది నష్టపోతారన్నారు. ఆటో వర్కర్స్ యూ నియన్ జిల్లా అధ్యక్షుడు ఇంటి సత్యనారాయ ణ మాట్లాడుతూ ఆటో కార్మికులందరికీ న్యా యం చేయాలని లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘ నాయకులు బి.వాసుదేవరావు పాల్గొన్నారు.