పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు

Oct 18 2025 7:09 AM | Updated on Oct 18 2025 7:09 AM

పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు

పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు

పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు పుష్కరిణిలో చెత్త తొలగింపు ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి నృసింహ సాగరం (పుష్కరిణి) ఒడ్డున పేరకుపోయిన చెత్తను దేవస్థానం సిబ్బంది తొలగించారు. అలాగే మెట్లను శుభ్రం చేశారు. ఈనెల 13న ‘సాక్షి’లో ‘మందుబాబులకు అడ్డాగా.. శ్రీవారి పుష్కరిణి’ శీర్షికతో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. పుష్కరణిలో పారిశుద్ధ్య పనులు చేపట్టి మెట్లపై ఉన్న బీరు సీసాలు, కాల్చిపడేసిన సిగరెట్లను తొల గించారు. ఒడ్డున పేరుకుపోయిన చెత్తను తొలగించి, శుభ్రం చేశారు. అయితే నీరు మురుగుతో దుర్వాసన వెదజల్లుతుండటంతో కార్తీక మాసంలో భక్తులు అందులో స్నానాలు ఆచరించే వీలు లేకుండా ఉంది. కనీసం పుష్కరిణి ప్రాంతంలో లైట్లు ఏర్పాటు చేస్తే మెట్లపై, కార్తీక దీపాలు వెలిగించేందుకు, పుష్కరిణిలో దీపాలు వదిలేందుకు అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు. రైళ్లలో మహిళలకు భద్రత కల్పించాలి 23 నుంచి కార్తీక మాసోత్సవాలు

బుట్టాయగూడెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే యత్నం చేస్తోందని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. శుక్రవారం ఆయన విలే కరులతో మాట్లాడుతూ సాక్షి మీడియాపై దూకుడు వైఖరి రాజ్యాంగం కల్పించిన వాక్‌ స్వాతంత్య్ర హక్కును నిరోధించేదిగా ఉందన్నారు. ప్రజల సమస్యలను, ఇబ్బందులను, ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తున్న సాక్షి మీడియాపై కూటమి సర్కారు అణచివేత ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రెండు రోజులుగా నెల్లూరు పోలీసులు సాక్షి ఎడిటర్‌ ధనంజయరెడ్డికి నోటీసులు ఇస్తూ బెదిరింపులకు గురిచేయడం బాధాకరమని అన్నారు. ఎన్నడూలేని విధంగా మీడియా కార్యాలయాల్లో సో దాలు, ఎడిటర్‌, పాత్రికేయులపై వేధింపులు సరికాదన్నారు. కూటమి ప్రభుత్వ తీరును ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు.

ఏలూరు (టూటౌన్‌): రైళ్లలో మహిళకు భద్రత కల్పి ంచాలని ఐద్వా డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఏలూరు జిల్లా ఐద్వా అధ్యక్ష కార్యదర్శులు పి.హైమావతి, ఎ.శ్యామల రాణి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లే రైలులో మహిళపై అగంతకుడు కత్తితో బెదిరించి అత్యాచారం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల రైళ్లలో మహిళలపై దాడులు పెరిగిపోయా యని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగి ఉన్న రైళ్లను అ డ్డాగా చేసుకుని, పని ప్రదేశాల్లో మహిళలపై దా డులు పెరుగుతున్నా రైల్వే అధికారులకు పట్టడం లే దన్నారు. రైళ్లలో పోలీసుల నిఘాపెంచాలని, ప్రతి బోగీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

భీమవరం ( ప్రకాశం చౌక్‌): భీమవరం గునుపూడిలోని పంచారామ క్షేత్రం ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం (సోమారామం)లో ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం దేవస్థానంలో ఆర్డీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పు లపర్తి రామాంజనేయులు సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మొబైల్‌ టాయిలెట్స్‌, మంచినీరు, మెడికల్‌ క్యాంపులు తదితర ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. దేవస్థానం వద్ద పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌కు, ట్రా ఫిక్‌ సమస్య లేకుండా చూడాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. జిల్లా దేవదాయశాఖ అధికారి సూర్యప్రకాష్‌, ఈఓ డి.రామకృష్ణంరాజు, దేవస్థానం చైర్మన్‌ బంగారురాజు, ట్రస్ట్‌ బోర్డ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement