
నూకాలమ్మ ఆలయానికి రూ.5 లక్షల విరాళం
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. నిత్య కై ంకర్యాలు, పంచామృతాభిషేకాలు, ఏకాదశ హారతి పూజలు నిర్వహించినట్లు ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలిపారు. అమ్మవారిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ కమిటీ ఛైర్మన్ రొంగల నాగేశ్వరరావు, కుటుంబసభ్యులు రూ.5,01,116 అందజేసినట్లు చైర్మన్ తెలిపారు. రొంగల నాగేశ్వరరావు రమాదేవి దంపతులు, దేవీ ప్రసాద్, అనూష దంపతులు, భాస్కర్ కుమార్, సాయి చంద్రిక దంపతులు, వారి కుటుంబ సభ్యులను సత్కరించారు.
ఏలూరు (టూటౌన్): పీడీఎస్‌ఓ, ఎన్‌వైఎస్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఫైర్ స్టేషన్ నుంచి కొత్త బస్టాండ్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విద్య, ఉపాధి రంగాల సంక్షోభం, యువత ఆత్మహత్యలు అంశంపై సదస్సును సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. పీడీఎస్‌ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్.భాను అధ్యక్షతన జరిగిన సదస్సులో కవి, రచయిత సుంకర గోపాల్ మాట్లాడారు. విద్యా విధానం అశాసీ్త్రయంగా ఉందని, మార్కులు, ర్యాంకులు, సర్టిఫికెట్లే లక్ష్యంగా సాగుతున్న చదువులు విద్యార్థుల ఆత్మహత్యలకు దోహదం చేస్తున్నాయని, ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని సామాజిక స్పృహ కలిగి పోరాటాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ఎన్‌వైఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.భాస్కర్, పీడీఎస్‌ఓ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె బాషా, ఏలూరు ప్రభుత్వ వైద్యశాల మాజీ సూపరింటెండెంట్ డా.రావి గోపాల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి: నేరం రుజువు కావడంతో ముద్దాయికి సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ నూజివీడు కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. కృష్ణా జిల్లా పామర్రు మండలం మల్లవరానికి చెందిన చుండూరు రమేష్ సగ్గూరులో బైక్ చోరీ చేశాడు. దీనిపై ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముద్దాయిని రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగిరిపల్లి ఎస్సై శుభ శేఖర్ దర్యాప్తు పూర్తి చేసి కేసుకు సంబంధించి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. నేరం రుజువు కావడంతో రమేష్‌కు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి శ్రావణి తీర్పు వెల్లడించారు.
భీమవరం: నన్నయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ ఎట్ ఫెన్సింగ్ టోర్నమెంట్ శుక్రవారం భీమవరంలోని సీఎస్‌ఎన్ డిగ్రీ కాలేజీలో నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి సుమారు 50 మంది పాల్గొనగా పలు విభాగాల్లో పోటీలు జరిగాయి. విజేతలకు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ, ప్రిన్సిపల్ సత్యనారాయణ, స్టేట్ ఫెన్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణమోహన్ బహుమతులు అందజేశారు.

నూకాలమ్మ ఆలయానికి రూ.5 లక్షల విరాళం