
సంతగుంట చెరువు ఆక్రమణ
కొయ్యలగూడెం: యర్రంపేట సంత చెరువు ఆక్రమణలకు గురైంది. మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న సంతచెరువు గట్టుపై కబేళా దుకాణాల సముదాయాలు వరుసగా నిర్మించారు. మరికొంతమంది వాణిజ్య దుకాణాలను నిర్మిస్తున్నారన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 30 ఎకరాల గర్భం కలిగిన సంత చెరువు ఆక్రమణలకు గురికాగా ఇరవై ఎకరాల గర్భం మిగిలిందని, దీంతో 150 ఎకరాలకు సాగునీరు అందే చెరువు నీరు పట్టుమని 25 ఎకరాలకు కూడా సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. కబేళా వ్యర్ధాలు చెరువులో కలపడంతో నీరు కలుషితం అవుతోందంటున్నారు. దుర్గంధంతో రాకపోకలు సాగించలేని పరిస్థితి ఎదురవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలోనే వాణిజ్య దుకాణాలు ఏర్పాటు చేయగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వాటిని అధికారులు తొలగించారన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చాక ఆక్రమణలు యథాతథంగా కొనసాగుతున్నాయని అన్నారు.

సంతగుంట చెరువు ఆక్రమణ