అప్పు చేసి పప్పుకూడు.. ఎన్నాళ్లు ? | - | Sakshi
Sakshi News home page

అప్పు చేసి పప్పుకూడు.. ఎన్నాళ్లు ?

Oct 17 2025 6:36 AM | Updated on Oct 17 2025 6:36 AM

అప్పు

అప్పు చేసి పప్పుకూడు.. ఎన్నాళ్లు ?

అప్పు చేసి పప్పుకూడు.. ఎన్నాళ్లు ? ● గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలి అప్పులు చేసి వంటలు చేయాల్సిన పరిస్థితి

ఎండీఎం నిర్వాహకుల డిమాండ్లు ఇవీ

ఉమ్మడి జిల్లాలో ఇలా..

పెరుగుతున్న ఖర్చులతో గత కొన్నేళ్లుగా ఇస్తున్న గౌరవ వేతనం నెలకు రూ.3 వేలు సరిపోవడం లేదు. ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలి. మూతపడుతున్న స్కూళ్లలో ఎండీఎం కార్మికులు, ఆయాలు రోడ్డున పడుతున్న పరిస్థితి, వీరందరికి ఉద్యోగ భద్రత కల్పించాలి.

– మోడియం నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎండీఎం కార్మిక సంఘం

బిల్లులు 3, 4 నెలలు ఆలస్యంగా జమవ్వడంతో ప్రతి నెలా అప్పులు చేసి వంటలు చేయాల్సిన సరిస్థితి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచితే ఆర్థిక భారం తగ్గుతుంది. యూపీ బిల్లులు జూలై నెల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. విడతల వారీగా వేయడంతో బ్యాంక్‌ల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

– కాసాని సత్తెమ్మ, నిర్వాహకురాలు, ఎండీఎం ఏజెన్సీ

నిడమర్రు: ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు, పోషకాహారలోపం నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన నిధులకు గ్రహణం పట్టింది. ఈ పథకం నిర్వాహకులకు నిధులను సకాలంలో చెల్లిచకపోవడంతో వారికి భారమవుతోంది. సరైన సమయానికి బిల్లులు రాకపోయినా, పిల్లల ఆకలి తీర్చడానికి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు అప్పులు చేసి వండి వడ్డిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం కళాశాలల్లో నిర్వాహకులకు 5 నెలల నుంచి, యూపీ స్కూళ్లలో నిర్వాహకులకు జూలై నుంచి బిల్లులు కూటమి సర్కారు మంజూరు చేయలేదు. మరోవైపు వంట సహాయకులకు ఇచ్చే రూ.3 వేలు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలంటూ విడతల వారీగా ఇస్తున్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కళాశాలల్లో పరిస్థితి మరింత దారుణం

గ్రామీణ ఇంటర్‌ కళాశాలల్లో గత ఏడాది నుంచి అమలవుతున్న భోజన పథకం నిర్వాహకుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వారికి ఫిబ్రవరి నెల నుంచి నిర్వహణ నిధులు కేటాయించకపోవడంతో వారంతా అప్పులు మీద అప్పులు చేసే పరిస్థితి నెలకొంది. ఉంగుటూరు మండలంలో నారాయణపురం, గణపవరం గ్రామాల్లో మాత్రమే రెండు ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలు ఉన్నాయి. బిల్లులు నెలలుగా బకాయి పడటంతో అప్పుల భారంతో కొన్ని చోట్ల మెనూ సక్రమంగా అమలు చేయడం లేదనే వాదనలు ఉన్నాయి. బియ్యం, గుడ్లు, రాగిపిండి, పప్పు చిక్కీలను ప్రభుత్వం సరఫరా చేసినా, అవసరమైన వంట గ్యాస్‌, కూరగాయలు, పప్పు, ఇతర వంట సామగ్రి నిర్వాహకులే కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. ఇవన్నీ దుకా ణాల వద్ద అరువు తీసుకొచ్చి వంట చేస్తున్నారు. తమకు రావాల్సిన సొమ్ములు ప్రభుత్వం నుంచి అందకపోవడం, అరువు ఇచ్చిన దుకాణదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో అందినచోట అప్పులు చేసి ఆర్థిక భారానికి గురవుతున్నామని వంట ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇచ్చేది అరకొర.. అదీ నెలల తరబడి

భోజన పథకం నిర్వాహకులకు మెనూలోని వంటల తయారుకు ఇచ్చేది అర కొర నిధులు, అవి కూడా నెలల తరబడి పెండింగ్‌లతో అనేక సమస్యలతో వారు సతమతమవుతున్నట్లు చెబుతున్నారు. మెనూ ప్రకారం సోమవారం కూరగాయలు/ ఆకుకూర పప్పు, మంగళవారం పులిహోర, రోటీ పచ్చడి, బుధవారం మిశ్రమ కూరగాయల కూర, గురువారం పలావు, బంగాళ దుంప కుర్మా, శుక్రవారం ఆకు కూర పప్పు, శనివారం మిశ్రమ కూరగాయాల కూర, చక్కెర పొంగల్‌ వండాలి. వీటితోపాటు రైస్‌ వండాలి, వారానికి మూడు రోజులు రాగిజావ, గుడ్డును వడ్డించాల్సి ఉంది. వీటి తయారీకి మాత్రం ప్రాథమిక విద్యార్ధులకు రూ. 5.88, 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ రూ.8.57 ఒక్కో విద్యార్థికి వంట, సరుకుల కొనుగోలు ఖర్చుల కింద చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఇచ్చే నగదు మార్కెట్‌లో ఒక్క ఇడ్లీ కూడా రాదంటూ వాపోతున్నారు. ఇటీవల జిల్లా స్థాయిలో ఎండీఎం కార్మికులు ఆందోళన అనంతరం అర కొరగా బిల్లులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు.

భోజన పథకంలో బిర్యానీ వడ్డిస్తున్న కార్మికులు సమస్యలపై ఎండీఎం నిర్వాహకులు, కార్మికుల ఆందోళన (ఫైల్‌)

ప్రతీ నెలా 5వ తేదీలోపు గౌరవ వేతనం, వంట ఖర్చుల బిల్లులు చెల్లించాలి.

గౌరవ వేతనం రూ.10 వేలు ఇవ్వాలి, మెనూ ఖర్చుల చార్జీలు పెంచాలి.

మూతపడుతున్న స్కూళ్లలోని నిర్వాహకులకు ఉపాధి భద్రత కల్పించాలి,

యూనీఫాం, గుర్తింపు కార్డులు ప్రభుత్వం అందించాలి.

గ్యాస్‌, వంట పాత్రలు ప్రభుత్వమే సరఫరా చేయాలి.

ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.

జిల్లా పాఠశాలలు ఎండీఎం కార్మికులు

నమోదు

ఏలూరు 1,710 92,203 5,732

పశ్చిమగోదావరి 1,384 78,755 4,350

వంట బకాయిలు అందక ఎండీఎం నిర్వాహకుల అవస్థలు

అరకొరగా నిధులు కేటాయిస్తున్న కూటమి సర్కారు

కళాశాలకు 5 నెలలు, యూపీలకు 3 నెలలుగా నిలిచిన చెల్లింపులు

పెరిగిన ధరలతో అప్పులతో కొనసాగిస్తున్న నిర్వాహకులు

అప్పు చేసి పప్పుకూడు.. ఎన్నాళ్లు ? 1
1/3

అప్పు చేసి పప్పుకూడు.. ఎన్నాళ్లు ?

అప్పు చేసి పప్పుకూడు.. ఎన్నాళ్లు ? 2
2/3

అప్పు చేసి పప్పుకూడు.. ఎన్నాళ్లు ?

అప్పు చేసి పప్పుకూడు.. ఎన్నాళ్లు ? 3
3/3

అప్పు చేసి పప్పుకూడు.. ఎన్నాళ్లు ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement