భీమవరం: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాల ఏఐఅండ్‌డీఎస్ విభాగాధిపతి కె సూర్యరాంప్రసాద్‌ను గురువారం కళాశాలలో ఘనంగా సత్కరించారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును తమ కళాశాలకు చెందిన రాంప్రసాద్ అందుకోవడం తమ కళాశాలకే గర్వకారణమని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు), ఉపాధ్యక్షుడు గోకరాజు పాండురంగరాజు అన్నారు. సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీ సంస్థ అవార్డుల ప్రదానోత్సవాన్ని విజయవాడలో నిర్వహించగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచేగాక పలు దేశాల నుంచి సుమారు 200 మంది ప్రొఫెసర్లు పాల్గొనడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : మండలంలోని దుద్దుకూరుకు చెందిన గిరిజనుడు తెల్లం కన్నయ్య(60) తాడిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తూ జారి కిందపడి గురువారం మృతిచెందాడు. మృతుడు కన్నయ్య మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సోదరుడు. కన్నయ్య మరణ వార్త విన్న బాలరాజు కన్నీరు మున్నీరయ్యారు. కన్నయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కన్నయ్య కుటుంబానికి పెద్ద దిక్కు అని, ప్రభుత్వం కన్నయ్య కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని బాలరాజు కోరారు.
పెదపాడు: నకిలీ విలేకరులు పెదపాడు మండలంలో హల్‌చల్ చేస్తున్నారు. కోళ్ల వ్యర్థాల వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో గురువారం ఖాళీగా వెళ్తున్న ఓ వాహనాన్ని ఆప్పి నకిలీ విలేకరి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో అనుమానించిన ఆ వాహనదారుడు ఆ వ్యక్తిని నకిలీ విలేకరిగా గుర్తించి పెదపాడు పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తి తాను పేరొందిన మీడియా సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులను నమ్మబలికాడు. అతని వద్ద ఉన్న ఐడీ కార్డును పరిశీలించి నకిలీ విలేకరుగా పోలీసులు గుర్తించి వారి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా గుడివాడ ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసే ప్రదీప్ అనే వ్యక్తి వచ్చి సదరు వ్యక్తిని తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో సదరు నకిలీ విలేకరికు 41 నోటీసు అందించినట్లు విస్వసనీయ సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అవార్డు గ్రహీత రాంప్రసాద్‌కు సత్కారం
అవార్డు గ్రహీత రాంప్రసాద్‌కు సత్కారం