పంచాయతీ పూర్వపు భవనాలకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ పూర్వపు భవనాలకు మోక్షం

Oct 17 2025 6:34 AM | Updated on Oct 17 2025 6:34 AM

పంచాయ

పంచాయతీ పూర్వపు భవనాలకు మోక్షం

ఆకివీడు: స్థానిక నగర పంచాయతీ పరిధిలో గంగానమ్మకోడు ప్రాంతంలో నిర్మించిన పంచాయతీ అసంపూర్తి భవనాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇటీవల ‘సాక్షి’లో వచ్చిన కథనానికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఆక్రమణల్లో ఉన్న భవన ప్రాంగణాల్ని ఖాళీ చేయించారు. ఆకివీడు పంచాయతీ పరిధిలోని ఈ ప్రాంతంలో 20 ఏళ్ల కూరగాయలు, మాంసం, చేపల దుకాణాల్ని ఏర్పాటు చేసేందుకు భవనాల నిర్మాణం చేపట్టారు. అయితే ఆ ప్రాంతం తనదేనని, తన వద్ద రికార్డులున్నాయని ప్రైవేటు వ్యక్తి కోర్టుకు వెళ్లారు. దీంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో బిచ్చగాళ్లు, అనాథలు ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారు. స్థానికులు కూడా కొంత ఆక్రమించారు. ఇటీవల బిచ్చగాళ్లను, అనాథల్ని అక్కడ నుండి పంపించివేసి, ఆ అసంపూర్తి భవనాల్ని ఆక్రమించారు. దీనిపై ‘సాక్షి’లో కథనం రావడంతో స్పందించి, వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. అసంపూర్తి భవన నిర్మాణాల్ని పూర్తి చేసి, అవసరమైతే కూరగాయల వ్యాపారాలకు, ఇతరులకు అద్దెకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఆ ప్రాంతాన్ని గురువారం ఉపసభాపతి కె.రఘురామకృష్ణంరాజు, నగర పంచాయతీ కమిషనర్‌ కృష్ణమోహన్‌ సందర్శించారు. ఆ భవనాలను సద్వినియోగంచేసుకోవాలని ఆదేశించారు.

పంచాయతీ పూర్వపు భవనాలకు మోక్షం 1
1/1

పంచాయతీ పూర్వపు భవనాలకు మోక్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement