కోటి సంతకాలతో కూటమిని నిలదీద్దాం | - | Sakshi
Sakshi News home page

కోటి సంతకాలతో కూటమిని నిలదీద్దాం

Oct 17 2025 5:58 AM | Updated on Oct 17 2025 5:58 AM

కోటి

కోటి సంతకాలతో కూటమిని నిలదీద్దాం

కోటి సంతకాలతో కూటమిని నిలదీద్దాం

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ సిగ్గుచేటు

పేద పిల్లలకు వైద్య విద్యను దూరం చేయడం దుర్మార్గం

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌, పార్లమెంట్‌ ఇన్‌చార్జి సునీల్‌

ఏలూరులో కోటి సంతకాల ఉద్యమ కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌. చిత్రంలో పార్లమెంట్‌ ఇన్‌చార్జి సునీల్‌, ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్‌, కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులు

ఏలూరు టౌన్‌: పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ప్రభుత్వంలో 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను తీసుకువస్తే.. నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తోందని.. కోటి సంతకాల ఉద్యమంతో కూటమి సర్కారు కుతంత్రాలను ఎండగడదామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌), ఏలూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జి, యువజన విభాగం రీజనల్‌ అధ్యక్షుడు కారుమూరి సునీల్‌కుమార్‌ అన్నారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌ ఆధ్వర్యంలో ఏలూరులోని పార్టీ కార్యాలయం వద్ద గురువారం రాత్రి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రతిఒక్కరూ కోటి సంతకాల దరఖాస్తులను పూర్తి చేసేందుకు ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు అనుమతులు తీసుకురావడంతో పాటు 5 మెడికల్‌ కాలేజీలను పూర్తి చేసి చూపించారన్నారు. అప్పటివరకు రాష్ట్రంలో 12 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉంటే, 2019 నుంచి 2024లో 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు తెచ్చిన గొప్ప దార్శనికుడు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం 16 నెల ల కాలంలో నిర్మాణాలు మొత్తం పూర్తి చేస్తే ఏకంగా 2,500 ఎంబీబీఎస్‌ సీట్లు రాష్ట్రానికి వచ్చేవనీ, అయితే ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేద పిల్లలకు సీట్లు అందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కల్తీ ఆంధ్రగా మార్చారు

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రీజనల్‌ అధ్యక్షుడు కారుమూరి సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ కూటమి నేతలు రాష్ట్రాన్ని కల్తీ ఆంధ్రప్రదేశ్‌గా మార్చివేశారని విమర్శించారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేశారని చెప్పారు. విజయనగరం, రాజ మండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీలు పూర్తి చేయగా.. పాడేరు, పులివెందుల మెడికల్‌ కాలేజీలు ఎన్నికల ఫలితాలు నాటికి పూర్తయ్యాయని తెలిపారు. కూటమి కుట్రలను ఎండగట్టేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఏలూరులో మద్యం తాగుతూనే ఒక వ్యక్తి చనిపోతే లిక్కర్‌ షాపు వాళ్లు కనీసం పట్టించుకోకుండా వ్యాపారం చేయటం వారి దుర్మార్గమైన పరిస్థితిని తెలియజేస్తుందని విమర్శించారు. నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, పార్టీ నాయకులు తులసీ వర్మ తదితరులు మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు కలిగే నష్టాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కార్యదర్శి దాసరి రమేష్‌, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్‌, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్‌, ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్‌, బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్‌, నగర, జిల్లాస్థాయి నాయకులు తంగెళ్ల రాము, పిట్టా ధనుంజయ్‌, ఎచ్చెర్ల ఉమామహేశ్వరరావు, మేతర సురేష్‌, గేదెల సూర్యప్రకాష్‌రావు, ఆర్‌టీఐ జిల్లా అధ్యక్షుడు వేంపాటి స్టాన్లీ బాబు, సోషల్‌ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు బండ్లమూడి సునీల్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

కోటి సంతకాలతో కూటమిని నిలదీద్దాం 1
1/1

కోటి సంతకాలతో కూటమిని నిలదీద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement