
టాయిలెట్ల నిర్మాణాలు వేగిరపర్చాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా చేపట్టాల్సిన టాయిలెట్ల నిర్మాణాలను నెలాఖరులోపు పూర్తిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ/వార్డుసచివాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మతులు, టాయిలెట్లు, తాగునీరు తదితర మౌలిక వసతుల కల్పనలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల వసతి గృహాల్లో తాగునీటిని పరీక్షించి, అవసరమైన చోట ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేయాలన్నారు.
గృహనిర్మాణాలపై సమీక్ష : స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో గృహ నిర్మాణాల ప్రగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా నిర్మాణాలపై కలెక్టర్ సమీక్షించారు. నిర్మాణాలు వేగిరపర్చి నెలాఖరులోపు పూర్తిచేయాలని ఆదేశించారు.
ఏలూరు టౌన్: రాష్ట్రంలో సంచలనంగా మారిన కల్తీ మద్యం వ్యవహారంలో సిట్ అధికారులు ఏలూరులోని ఒక మద్యం వ్యాపారిని విచారించారు. కల్తీ మద్యం కుంభకోణంలో కీలక పా త్రధారి జనార్దన్‌కు ఏలూరులోని వ్యక్తికి మద్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏలూరుకు చెందిన వ్యక్తిని విచారించినట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. గ తంలో ఇద్దరి మద్య జరిగిన వ్యాపార లావాదేవీల్లో భాగంగానే డబ్బులు ఇచ్చినట్లు, ప్ర స్తుతం అలాంటి ఆర్థిక లావాదేవీలేమీ జరగలేదని అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.
భీమవరం: పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘ అధ్యక్ష, కార్యదర్శులు శివరామ్, రాజారెడ్డి మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల సమస్యలు వినే నాథుడే కరువయ్యాడన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధింపులు పెరిగాయని, వేతన బకాయిలు, పని ఒత్తిడి బాగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. టెండర్ తో నిమిత్తం లేకుండా ఉద్యోగాలు కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా టెండర్ల పేరుతో డబ్బులు వసూలు చేయడం మానుకోలేదని ఆరోపించారు. గౌరవ అధ్యక్షుడు ఎం. ఆంజనేయులు మాట్లాడారు.

టాయిలెట్ల నిర్మాణాలు వేగిరపర్చాలి