
బాణసంచా.. తస్మాత్ జాగ్రత్త!
బాణసంచా దుకాణాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ విస్తృత ప్రచారం చేస్తోంది. IIలో u
నరసాపురం రూరల్: కార్తీకమాసంలో వన సమారాధనలనకు కేపీపాలెం–పేరుపాలెం సాగర తీరాలకు వచ్చే సందర్శకులకు బీచ్ వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని నరసాపురం ఆర్డీఓ దాసి రాజు సూచించారు. గురువారం పేరుపాలెం బీచ్ గెస్ట్ హౌస్ వద్ద అధికారులతో సమీక్షించారు. కార్తీక మాసంలో పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది యాత్రికులు, సందర్శకులు వచ్చే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదుల నిర్మాణంతో పాటు సముద్రంలో స్నానానికి దిగిన వారికి ప్రాణనష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బీచ్‌కు వచ్చే మూడు మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడటంతో పాటు వాహనాలు పార్కింగ్‌కు అవసరమయ్యే స్థలాన్ని గుర్తించాలన్నారు. ప్రత్యేకంగా శని, ఆదివారం రోజుల్లో పెద్దఎత్తున సందర్శకులు వస్తారని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. నిర్దేశించిన ప్రదేశం దాటి సముద్ర స్నానం చేసేవారిని తక్షణమే ఒడ్డుకు తీసుకువచ్చేందుకు గజ ఈతగాళ్లను నియమించాలని సూచించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులను వివరించారు. సర్పంచ్‌లు తిరుమాని విజయలక్ష్మి, అందే దొరబాబు, డీపీఓ ఎన్.రామనాథరెడ్డి, తహసీల్దార్ రాజ్‌కిషోర్, డీఎల్పీఓ జ్యోతిర్మయి, డిప్యూటీ ఎంపీడీఓ నవీన్‌కిరణ్, పోలీస్, ఎకై ్సజ్ శాఖ అధికారులు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.