
నమ్మకం కలిగించాలి
సౌకర్యాలతో క్యూ కాంప్లెక్స్
శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా అనివేటి మండపం పక్కన రూ. 12.50 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. 10లో u
కేరళ డీజీపీ ఆజాద్ చంద్రశేఖర్
వీరవాసరం: నిరాడంబర అధికారిగా ఉండటంతో పాటు ప్రజలకు నమ్మకం కలిగించడం పోలీసు బాధ్యత అని కేరళ డీజీపీ రావాడ ఆజాద్ చంద్రశేఖర్ అన్నారు. వీరవాసరానికి చెందిన ఆయనకు బుధవారం స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో పౌర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో చదువుకున్నానని, కేరళ డీజీపీగా ఎదగడానికి ప్రధాన కారణం గురువులు, ఊరి ప్రజల ఆశీస్సులే కారణం అన్నారు. ఇదే ఊరిలో తనతో పాటు చదివిన ఎం.సుబ్బారెడ్డి, చికిలే సుధాకర్ ఆలిండియా సర్వీసులకు ఎంపికవడం, వివిధ రాష్ట్రాల్లో అత్యున్నత పదవుల్లో ఉండటంతో వీరవాసరం ఖ్యాతి దేశం మొత్తం తెలిసిందన్నారు. ఏదైనా సాధించాలంటే ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ, స్పిరిట్యువల్ ఎనర్జీ అనేవి ప్రధానంగా ఉండాలని, ఉన్న సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ కేరళ డీజీపీగా జిల్లా వాసి ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆక్షాంక్షించారు. జడ్జి వీరవల్లి గోపాలకృష్ణ, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్‌పర్సన్ పీతల సుజాత, డీఎస్పీ కూనపరెడ్డి సత్యనారాయణ, రిటైర్డ్ డీఎస్పీ బోను అప్పాజీరావు, డిప్యూటీ కలెక్టర్ మద్దాల సత్యప్రభ, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవానీ, సర్పంచ్ చికిలే మంగతాయారు పాల్గొన్నారు.